Asianet News TeluguAsianet News Telugu

ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్, త్వరలో నోటిఫికేషన్

తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఇప్పటికే అనేక ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి సర్కార్ భారీ నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో భారీగా ఫైర్ సిబ్బందిని నియమించుకోడానికి ఆర్థిక శాఖ నుండి అనుమతి లభించింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 18 అగ్నిమాపక కేంద్రాల్లో 306 పోస్టుల భర్తీ కానున్నాయి.ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

TS Finance Dept Approved To Fill 306 Posts In Telangana Fire Department

తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఇప్పటికే అనేక ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి సర్కార్ భారీ నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో భారీగా ఫైర్ సిబ్బందిని నియమించుకోడానికి ఆర్థిక శాఖ నుండి అనుమతి లభించింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 18 అగ్నిమాపక కేంద్రాల్లో 306 పోస్టుల భర్తీ కానున్నాయి.ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

 ఈ సంవత్సరం జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ... రానున్న రోజుల్లో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేపడతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుండి ఒక్కోటిగా ప్రభుత్వ శాఖల నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడుతూ వస్తున్నాయి. మొదట పోలీస్ శాఖ నుండి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత టీఎస్‌పిఎస్సీ నుండి గ్రూప్4, వీఆర్వో ఉద్యోగాల భర్తీతో మరికొన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఇలా తెలంగాణ లో ఉద్యోగాల జాతర జరుగుతుందా అన్నట్లుగా నోటిఫికేషన్లు వెలువడుతూ నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని కల్పించాయి.

ఇక తాజాగా ఆర్థిక శాఖ మరికొన్ని ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 306 ఉద్యోగాల్లో 180 ఫైర్ మ్యాన్, 54 డ్రైవర్ ఆపరేటర్, 36 లీడింగ్ ఫైర్ మ్యాన్, 18 స్టేషన్ ఫైర్ ఆఫీసర్, 18 జూనియర్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios