సురక్షితంగా బయటపడ్డ పద్మాదేవేందర్ రెడ్డి మెదక్ జిల్లా మనోహరబాద్ లో ఘటన

తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌ రెడ్డి తృటిలో పెనుప్రమాదం నుంచి బయటపడ్డారు. ఒక ఆటో ఆమె కాన్వాయ్‌కు అడ్డు రావడంతో కాన్వాయ్ లోని కారు బలంగా డిప్యూటీ స్వీకర్ కారును ఢీ కొట్టింది.

మెదక్ జిల్లా మనోహరాబాద్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చేగుంటలో జరిగే ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి పద్మాదేవెందర్ రెడ్డి తన కారులో కన్వాయ్ తో సహా బయలుదేరారు.

మనోహరాబాద్ చౌరస్తా వద్దకు చేరుకోగానే జాతీయ రహదారి వద్ద మలుపు తిరుగుతున్న ఆటో వేగంగా వచ్చి వీరి కాన్వాయ్ ని ఢీకొట్టంది.

ఆటోను తప్పించబోయిన ఎస్కార్ట్ వాహన డ్రైవర్ బ్రేక్ వేయడంతో.. కాన్వాయ్ లోని పద్మా దేవెందర్ రెడ్డి కారు, వెనకాలే వస్తున్న మరో కారు బలంగా ఢీకొన్నాయి.

అదృష్టవశాత్తు ప్రమాదం లో ఎవరికీ గాయాలు కాలేదు.ఘటనానంతరం పద్మాదేవెందర్ రెడ్డి మరో కారులో వివాహా వేడుకకు బయలుదేరారు.

ప్రమాద వార్త తెలియగానే సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు ఫోన్ ద్వారా పద్మాదేవెందర్ రెడ్డిని పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.