ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన మంత్రివర్గం

సీఎం కేసీఆర్ గతంలో తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రాష్ట్రంలో ముస్లింలకు, ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి బిల్లుకు ఆమోదం తెలుపుతు టీఆర్ఎస్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న నిర్ణయాన్ని కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. అలాగే, ఎస్టీలకు 10శాత రిజర్వేషన్ కల్పించేందుకు కూడా ఆమోదముద్ర వేసింది.

సుధీర్ కమిషన్, చెల్లప్ప కమిషన్, బీసీ కమిషన్ ల నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.రిజర్వేషన్ల బిల్లుపై ఆమోదం తెలపడంతో పాటు మరికొన్ని అంశాలపై కేబినెట్ చర్చించింది.

ముఖ్యంగా మత్స్యకారులకు పరిహారం పెంపు, కాళేశ్వరం, మధ్యమానేరు ప్రాజెక్టుల టెండర్ల అంశాలు కేబినెట్ భేటీలో చర్చకు వచ్చినట్లు సమాచారం.