వరంగల్:  వరంగల్  అర్బన్ బీజేపీ కార్యాలయం వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు  దిగారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్  కాన్వాయ్ ను టీఆర్ఎస్ శ్రేణులు హైవేపై అడ్డుకొన్నాయి. టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకొన్నారు.

వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలపై ఆదివారం నాడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఎంపీ ప్రెస్‌మీట్ పూర్తైన కొద్దిసేపటికే టీఆర్ఎస్ శ్రేణులు బీజేపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.

ప్రెస్  మీట్ ముగించుకొని వెళ్తున్న ఎంపీ అరవింద్ వాహనాన్ని హైవేపై టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకొన్నాయి. పోలీసులు టీఆర్ఎస్ శ్రేణులను అదుపులోకి తీసుకొన్నాయి. ఎంపీ వాహనాన్ని సురక్షితంగా  అక్కడి నుండి పంపారు.

మరికొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.  కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకొన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై  చేసిన వ్యాఖ్యలను ఎంపీ వెనక్కు తీసుకోవాలని టీఆర్ఎస్ డిమాండ్ చేసింది.

ఇదిలా ఉంటే వరంగల్ బీజేపీ కార్యాలయంపై టీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ సంజయ్ తీవ్రంగా ఖండించారు. రాాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య వారం రోజులుగా మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాలపై బీజేపీ ఒంటికాలిపై విమర్శలు చేస్తోంది.