కవితపై వ్యాఖ్యలు: నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇంట్లో ఫర్నీచర్‌ను ధ్వంసం చేసిన టీఆర్ఎస్

నిజామాబాద్ ఎంపీ  అరవింద్  ఎమ్మెల్సీ  కవితపై  అనుచిత  వ్యాఖ్యలు  చేశారని ఆరోపిస్తూ  ఎంపీ  అరవింద్ ఇంటిపై  దాడికి దిగారు. 

TRS Workers Destroyed Nizamabad MP Arvind House Furniture

హైదరాబాద్: టీఆర్ఎస్  ఎమ్మెల్సీ కల్వకుంట్ల  కవితపై  అనుచిత  వ్యాఖ్యలు  చేశారని  ఆరోపిస్తూ  నిజామాబాద్  ఎంపీ  అరవింద్  ఇంట్లో  ఫర్నీచర్ ను టీఆర్ఎస్  కార్యకర్తలు  వుక్రవారం నాడు  ధ్వంసం చేశారు.హైద్రాబాద్  లోని  నిజామాబాద్  ఎంపీ  అరవింద్ నివాసం లోపలికి  వచ్చిన టీఆర్ఎస్  కార్యకర్తలు  ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు.  టీఆర్ఎస్  కార్యకర్తలు  సుమారు  20  మంది  ఇంట్లోకి  వచ్చి  దేవుడి ఫోటోలు, టీపాయ్,  ఫర్నీచర్ , అద్దాలను  ధ్వంసం చేశారు.  మరో  వైపు ఎంపీ  అరవింద్ నివాసంలో ఉన్న  కారుపై  కూడా  టీఆర్ఎస్  శ్రేణులు దాడికి  దిగారు. ఈ  కారు అద్దాలు  దెబ్బతిన్నాయి. 

ఎంపీ  అరవింద్  ఇంటికి  సమీపంలో  టీఆర్ఎస్  కార్యకర్తలు   గూమికూడారు.  టీఆర్ఎస్  కార్యకర్తలు ఎంపీ  ఇంటి  ముందు  ఆందోళనకు  దిగే  విషయం  తెలుసుకున్న పోలీసులు అక్కడికి  చేరుకున్నారు. ఎంపీ  ఇంటి  ముందు  నిలబడి  సీఐ  టీఆర్ఎస్  శ్రేణులను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. అయితే టీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా  గేటును  తోసుకుంటూ ఇంట్లోకి  ప్రవేశించారని అరవింద్  నివాసంలో  ఉన్నవారు  మీడియాకు  చెప్పారు.

టీఆర్ఎస్  శ్రేణులు  నిజామాబాద్  ఎంపీ అరవింద్  ఇంటి  ముందు  ధర్నాకు  దిగారు.  ఈ సమయంలో  ఉద్రిక్తత  చోటు  చేసుకుంది. అరవింద్  ఇంటి  ముందు  ఆందోళనకు  దిగిన  టీఆర్ఎస్ శ్రేణులను  పోలీసులు  అరెస్ట్ చేశారు.  నిన్న  నిజామాబాద్ లో  మీడియా సమావేశం  ఏర్పాటు  చేసి  కవిత  కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని  అరవింద్  వ్యాఖ్యానించారు.  ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్  శ్రేణులు  మండిపడ్డాయి.  గతంలో కూడా  కవితపై  ఎంపీ  అరవింద్  వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారని  టీఆర్ఎస్  శ్రేణులు

బీజేపీలో చేరాలని  కవితను  అడిగారని  టీఆర్ఎస్  శాసనసభపక్ష  సమావేశంలో  కేసీఆర్  వ్యాఖ్యలు  చేశారు.ఈ వ్యాఖ్యలపై  నిజామాబాద్  ఎంపీ  స్పందించారు. కవితను  ఎవరైనా  కొంటారా అని ఆయన  ప్రశ్నించారు. కవితను  ఎవరైనా  పార్టీలో చేర్చుకోవాలని  ప్రయత్నాలు  చేసినవారినిని  సస్పెండ్ చేయాలని  అరవింద్  డిమాండ్ చేశారు. అంతేకాదు  కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు  కవిత ఫోన్ చేసిందని కాంగ్రెస్  పార్టీ  జాతీయ ప్రధానకార్యదర్శి  తనకు  ఫోన్  చేసినట్టుగా  అరవింద్ చెప్పారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios