Asianet News TeluguAsianet News Telugu

రాఖీ కట్టినప్పుడు ఆ పదం గుర్తుకు రాలేదా: రాములమ్మపై సుధారాణి ఫైర్

కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపైనర్ విజయశాంతిపై టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు గుండు సుధారాణి నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్‌కు రాఖీ కట్టినప్పుడు దొర అనే పదం విజయశాంతికి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలు సంపాదన పథకాలుగా కనిపిస్తున్నాయా అంటూ నిలదీశారు. రాములమ్మగా మహిళకు ఇచ్చే బతుకమ్మ చీరలను కాంగ్రెస్ అడ్డుకోవడంపై తన స్టాండ్‌ను చెప్పాలని డిమాండ్ చేశారు. 
 

trs woman leader g.sudharani fires on vijayasanthi
Author
Warangal, First Published Oct 5, 2018, 5:15 PM IST

వరంగల్: కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపైనర్ విజయశాంతిపై టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు గుండు సుధారాణి నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్‌కు రాఖీ కట్టినప్పుడు దొర అనే పదం విజయశాంతికి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలు సంపాదన పథకాలుగా కనిపిస్తున్నాయా అంటూ నిలదీశారు. రాములమ్మగా మహిళకు ఇచ్చే బతుకమ్మ చీరలను కాంగ్రెస్ అడ్డుకోవడంపై తన స్టాండ్‌ను చెప్పాలని డిమాండ్ చేశారు. 

గత ఏడాది నుంచి బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్నామని, తరతరాల నుంచి వస్తున్న సంస్కృతిని కాపాడుకోవడంతో పాటు, ఆడపడుచులకు అన్నలా కేసీఆర్ సర్కార్ చీరలు అందిస్తోందన్నారు. అలాంటి చీరలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు. బతుకమ్మ చీరల పంపిణీతో చేనేతలకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇలాంటి పథకాలపై రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని హితవు పలికారు. 

రైతులకు మేలు చేసేందుకు ప్రాజెక్టులు కడుతుంటే వాటిని సైతం అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రాజెక్టులపై కోర్టులో కేసులు వేస్తూ అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ మండిపడ్డారు.

Follow Us:
Download App:
  • android
  • ios