స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. నల్గొండ, వరంగల్, రంగారెడ్డి స్థానిక సంస్థల నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించింది.

నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి లక్ష్మీపై టీఆర్ఎస్ అభ్యర్ధి చిన్నపరెడ్డి విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్ధి తేరా చిన్నపరెడ్డికి 640 ఓట్లు పోలవ్వగా.. కాంగ్రెస్ అభ్యర్ధికి 414 ఓట్లు పోలయ్యాయి.

ఇక వరంగల్‌లో టీఆర్ఎస్ అభ్యర్ధి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర సమితికి 850, కాంగ్రెస్‌కు 23 ఓట్లు మాత్రమే పోలవ్వడంతో... 827 ఓట్ల మెజారిటీతో పోచంపల్లి విజయం సాధించారు. 

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న 806 ఓట్లకు గాను.. టీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డికి 510 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్ రెడ్డికి 266 ఓట్లు వచ్చాయి. దీంతో మహేందర్ రెడ్డి 244 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.