హైదరాబాద్: మల్కాజ్ గిరి ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు శాసనమండలి విప్, టీఆర్ఎస్ నేత బోడకుంటి వెంకటేశ్వర్లు. రేవంత్ రెడ్డి రాజకీయాలకు పనికిరారంటూ ధ్వజమెత్తారు. చీకటి సెటిల్‌మెంట్లు చేసుకోవడానికి మాత్రమే రేవంత్ రెడ్డి సూటవుతారంటూ సెటైర్లు వేశారు. 

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని విమర్శించారు. కేసీఆర్‌ ఆలోచనతో జెన్‌కో సీఎండీ ఆరునెలల్లోనే విద్యుత్‌ కొరత తీర్చారని చెప్పుకొచ్చారు. విద్యుత్ కొరత తీరిస్తే సంతోషించాల్సింది పోయి విమర్శిస్తారా అంటూ మండిపడ్డారు. 

కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గతపోరు ఎక్కువైందన్న శాసనమండలి విప్ పీసీసీ పదవి కోసం రేవంత్ చిల్లరగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభాకర్‌రావు టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కాకుండా కాంగ్రెస్ హయాంలోనూ విద్యుత్ శాఖలో పనిచేశారన్న విషయం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని శాసనమండలి విప్ వెంకటేశ్వర్లు సూచించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

నేను వివరాలిస్తున్నా: ప్రభాకర్ రావుకు రేవంత్ రెడ్డి సవాల్

ట్రాన్స్‌‌కో సీఎండీప్రభాకర్‌రావును కాల్చినా తప్పులేదు: రేవంత్ రెడ్డి