హైదరాబాద్: విద్యుత్ కొనుగోళ్ల విషయంలో టీఎస్‌పీడీసీఎల్ సీఎండీ ప్రభాకర్ రావు అబద్దాలు చెబుతున్నారని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభాకర్ రావును గన్ పార్క్‌ ముందు నిలబెట్టి కాల్చినా తప్పు లేదని  ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు లేవని టీఆర్ఎస్ బుకాయిస్తోందని రేవంత్ రెడ్డి మండిపడ్డాడు.  చత్తీస్ ఘడ్ ప్రభుత్వంతో విద్యుత్ కొనుగోళ్ల విషయంలో రాష్ట్రానికి తీవ్ర నష్టమని  ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదే విషయాన్ని అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడ చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం తెర వెనుక అదానీ,  తెర ముందు ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం ఉందని  ఆయన చెప్పారు.

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం వల్ల తెలంగాణ రాష్ట్రానికి నష్టమని  ఈఆర్‌సీకి కూడ ఫిర్యాదు చేశామని ఆయన చెప్పారు. విద్యుత్ ను కేసీఆర్ తన ఆర్దిక వనరుగా మార్చుకొన్నారని ఆయన విమర్శించారు.