టీఆర్ఎస్ విజయగర్జన సభ వాయిదా: దీక్షా దివస్ రోజునే వరంగల్‌లో సభ

టీఆర్ఎస్ విజయగర్జన సభ ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది టీఆర్ఎస్. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ తలపెట్టిన నిరహారదీక్ష నవంబర్ 29న ప్రారంభించారు. దీంతో దీక్షా దివస్ రోజునే ఈ సభను నిర్వహించాలని నిర్ణయం తీసుకొంది టీఆర్ఎస్.

TRS Vijaya Garjana sabha Post pones To November 29

హైదరాబాద్:  టీఆర్ఎస్ విజయగర్జన సభను వాయిదా వేసింది Trs. ఈ నెల 15న నిర్వహించాల్సిన సభను ఈ నెల 29వ తేదీకి టీఆర్ఎస్ వాయిదా వేసింది.రెండు దఫాలు తెలంగాణరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ సర్కార్ ప్రజల కోసం చేసిన కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం  TRS Vijaya Garjana sabha  నిర్వహించాలని తలపెట్టింది.  వరంగల్ లో ఈ సభను నిర్వహించాలని టీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయం తీసుకొంది. 

also read:ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: టీఆర్ఎస్‌లో పోటీ తీవ్రం, రేసులో కీలక నేతలు

నవంబర్ 15 న జరుపతలపెట్టిన తెలంగాణ విజయ గర్జన సభను తెలంగాణ ధీక్షా దివస్ అయిన నవంబర్ 29 వ తేదీన నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా టిఆర్ఎస్ నేతలు, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, ఆరూరి రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ధర్మారెడ్డి తదితర పార్టీ ముఖ్యనేతలు వరంగల్ సమావేశంలో ముక్త కంఠంతో చేసిన అభ్యర్థన మేరకు సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు.

నాటి ఉద్యమ రథసారథిగా తెలంగాణ వచ్చుడో కెసిఆర్ సచ్చుడో ’ అనే నినాదంతో సిఎం కెసిఆర్ ప్రారంభించిన ధీక్షా దివస్’ నవంబర్ 29 తేదీయే తెలంగాణ విజయ గర్జన సభ నిర్వహణకు తగిన సందర్భమని నేతలు తమ అభిప్రాయాలను సిఎం కెసిఆర్ కు విన్నవించారు. దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో జరుపతలపెట్టిన తెలంగాణ విజయ గర్జన సభను, తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడి స్వరాష్ట్ర సాధనకు మూలమైన  ధీక్షా దివస్ రోజే జరపాలని వారి అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన సిఎం కెసిఆర్ తెలంగాణ విజయ గర్జన సభను నవంబర్ 29 వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో చారిత్రాత్మక తెలంగాణ విజయ గర్జన సభను కనీవిని ఎరుగని రీతిలో విజయవంతం చేయడానికి ఇప్పటికే కమిటీలు వేసుకోని ముమ్మరంగా కృషిచేస్తూ ఏర్పాట్లల్లో నిమగ్నమైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాల  టిఆర్ఎస్ నేతలు ఈ విషయాన్ని గమనించాలని సిఎం తెలిపారు.  ఇప్పటికే చేసుకున్న ఏర్పాట్లను, బస్సులు తదితర రవాణా వ్యవస్థలను  ఈ నెల 29 వ తేదీకి మార్చుకోవాలని సిఎం సూచించారు. తేదీ మార్పు విషయాన్ని క్షేత్రస్థాయి కార్యకర్తలకు తెలియచేయాలన్నారు.

కేసీఆర్ నవంబర్ 29వ తేదీన దీక్షను ప్రారంభించాలని నిర్ణయం తీసుకొన్నారు. దీక్షను ప్రారంభించేందుకు వస్తున్న సీఎం ను పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మం జిల్లా జైలుకు తరలించారు. జైలులోనే కేసీఆర్ దీక్షను కొనసాగించారు. అయితే ఆయనను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కేసీఆర్ ఆరోగ్యం విషమించడంతో పోలీసులు  ఆయనను నిమ్స్ కు తరలించారు. కేసీఆర్ నిమ్స్ లో ఉన్న సమయంలోనే అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం తెలంగాణ  రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ గురించి కీలక ప్రకటన చేశారు.ఈ ప్రకటనతో కేసీఆర్ దీక్షను విరమించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios