Asianet News TeluguAsianet News Telugu

మోడీ, కేసీఆర్ ల మధ్య మళ్లీ ప్రోటోకాల్ రగడ.. అయిపోయిన పెళ్లికి బాజాలా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీల మధ్య మరోసారి ప్రోటోకాల్ వివాదం రాజుకుంది. నవంబర్ 12న రామగుండం ఎరువుల ప్యాక్టరీని జాతికి అంకితం చేసే విషయంలో ప్రోటోకాల్ పాటించలేదని టీఆర్ఎస్ మండిపడుతోంది. 

 

TRS tweet controvery on pm narendramodi visit to ramagundam
Author
First Published Nov 9, 2022, 9:39 AM IST

హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 12న రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసే కార్యక్రమ ఆహ్వానంలో కనీస ప్రోటోకాల్ ను పాటించలేదని టిఆర్ఎస్ ఆరోపించింది. 11 శాతం వాటాతో కర్మాగారం పునరుద్ధరణలో అధికారిక భాగస్వామిగా ఉన్న తెలంగాణ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజలను కేంద్ర ప్రభుత్వం  అవమానించిందని మంగళవారం ట్విట్టర్ లో విమర్శించింది.  ప్రధాని తర్వాత అతిథిగా  సీఎం కేసీఆర్ పేరునే చేర్చలేదని తెలిపింది. నామమాత్రంగా ఆహ్వానం పంపి చేతులు దులిపేసుకుందని పేర్కొంది. 

మళ్లీ ఉత్త చేతులతోనే ప్రధాని…
‘ప్రధాని మోదీ ఈసారి కూడా తెలంగాణకు ఉత్త చేతులతోనే వస్తున్నారు. మొన్న సర్కారును కూల్చే కుట్ర బయటపడి.. మునుగోడులో ఓడి.. అయిపోయిన పెళ్ళికి బాజాలు కొట్టినట్టు.. రెండేళ్ల క్రితం పున:ప్రారంభమై, దేశమంతటికీ ఉత్పత్తులను పంపుతున్న రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసే పేరుతో మాయ చేయనున్నారు. తెలంగాణకు చేసిన అన్యాయాలపై ఆయన ఏం చెబుతారు? విభజన చట్టం హామీల అమలు సంగతి ఏమిటి? నీతి అయోగ్ చెప్పిన నిధులు ఇచ్చేది ఎప్పుడు అని తెలంగాణా సమాజం నిగ్గదీసి అడుగుతోంది అని టిఆర్ఎస్ పేర్కొంది. 

కాగా, రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసే నిమిత్తం ప్రధాని మోదీ ఈ నెల 12న రాష్ట్రానికి వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ఆహ్వానం విషయంలో వివాదం మొదలైంది. రామగుండం ఫ్యాక్టరీలో తెలంగాణ రాష్ట్రం కూడా అధికారిక భాగస్వామిగా ఉన్నా మోడీ ప్రభుత్వం కనీసం  ప్రోటోకాల్ పాటించలేదని టిఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 2020  నవంబర్ లో భారత్ బయోటెక్ సందర్శన కోసం అధికారికంగా హైదరాబాద్ కు వచ్చిన ప్రధాని మోడీ ప్రోటోకాల్ ఇవ్వకుండా సీఎం కేసీఆర్ ను అవమానించారని టిఆర్ఎస్ వర్గాలు గుర్తుచేస్తున్నాయి.

యాదాద్రి బహుపేటలో విషాదం: ప్రేమ జంట ఆత్మహత్య

కాగా రామగుండం ఎరువుల కర్మాగారంలో 2021 మార్చిలోనే ఉత్పత్తి మొదలైంది. ఇప్పటివరకు 10 లక్షల టన్నుల ఉత్పత్తి చేస్తోంది అని గుర్తుచేశారు. తెలంగాణలో జరుగుతున్న మంచి కార్యక్రమాలను తన ఖాతాలో వేసుకునేందుకు మోడీ ఉత్సాహం చూపుతున్నారని ఎద్దేవా చేసింది టిఆర్ఎస్. 

ఇదిలా ఉండగా, రామగుండంలో రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సిఎల్) ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 12న తెలంగాణకు రానున్నారు. మోదీ నవంబర్ 12న ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చి హెలికాప్టర్‌లో రామగుండం బయలుదేరి, ప్రారంభోత్సవం అనంతరం తిరిగి హైదరాబాద్‌కు చేరుకుని అదే రోజు న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. అయితే, ఇటీవల గత కొన్నిసార్లు జరుగుతున్నట్టుగానే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు  ప్రధానికి ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలకడం గానీ, ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావడంగానీ చేయరని టీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. 

ఇది అధికారిక కార్యక్రమం కాబట్టి, ప్రోటోకాల్ ప్రకారం, ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకోవాలి. విమానాశ్రయానికి వెళ్లి కలవాల్సి ఉంటుంది. కాగా, గత ఫిబ్రవరిలో నగర శివార్లలోని చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో సమతా విగ్రహావిష్కరణకు ప్రధాని వచ్చినప్పుడు కేసీఆర్ వెళ్లలేదు. అప్పటి నుంచి మోదీ పర్యటనలన్నింటినీ ఆయన దాటవేశారు. కేసీఆర్ ప్రోటోకాల్‌ను పాటించకపోవడానికి ప్రధానమంత్రి 'ప్రైవేట్ పర్యటనలు' కారణమని CMOలోని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అయితే, RFCL ప్రారంభోత్సవం అధికారిక కార్యక్రమం. ఇక దీనికి ముఖ్యమంత్రిని ఆహ్వానించారా లేదా అనే దానిపై కూడా స్పష్టత లేదు. ఇది అధికారిక కార్యక్రమం కాబట్టి, ప్రోటోకాల్ ప్రకారం RFCL ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రికి కేంద్రం ఆహ్వానం పంపుతుందని అధికారిక వర్గాలు అభిప్రాయపడ్డాయి.

Follow Us:
Download App:
  • android
  • ios