తీగల కృష్ణారెడ్డి అనగానే మనకు గుర్తొచ్చేది పెద్ద పెద్ద మీసాలతోటి ఉండే నాయకుడు అని. ఆయన గతంలో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగర మేయర్ గా పనిచేశారు. తర్వాత కాలంలో టిడిపిలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బంగారు తెలంగాణ నిర్మాణం చేపట్టేందుకు టిడిపి ని వదిలేసి టిఆర్ఎస్ లో చేరారు. టిఆర్ఎస్ లో చేరిన తర్వాత బంగారు తెలంగాణ నిర్మాణం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. అయితే ఇటీవల ఆటవిడుపు కోసం ఒక టివి షోలో పాల్గొన్న తీగల అక్కడున్న టివి స్టార్లతో సమానంగా డ్యాన్స్ చేశారు. దుమ్మురేపారు. ఆయన డ్యాన్స్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వారు చప్పట్లే చప్పట్లు... కేకలు.. వీలలు వేసి ఎంకరేజ్ చేశారు. తీగల డ్యాన్సా మజాకా? తీగల డ్యాన్స్ మీరూ చూడండి. కింద వీడియోలో.