Asianet News TeluguAsianet News Telugu

బిజెపి మోడీకి టిఆర్ఎస్ బిసి దెబ్బ

  • బిసిలకు ఏం గొప్ప పనులు చేశారని నిలదీస్తున్న టిఆర్ఎస్
  • బిసిల్లో బిజెపికి పట్టు లేకుండా చేసేందుకు కార్యాచరణ
  • ఇప్పటికే రంగంలోకి దిగిన బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న
TRS targets modi from OBC angle

బిసి వర్గాలకు చెందిన నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు. ఓబిసి కులస్థుడిని ప్రధాని పీఠం మీద కూర్చోబెట్టిన ఘనత బిజెపికే దక్కుతుంది. ఈ కామెంట్స్ మనం చాలా సందర్భాల్లో వినే ఉన్నాం. ఈ గొప్పలు చెప్పుకుంటున్న బిజెపిపై టిఆర్ఎస్ పార్టీ అదే అదే ఆయుధంగా దాడికి దిగుతున్నది. ఆ వివరాలేంటో చదవండి.

జాతీయ స్థాయిలో ఫ్రంట్ ఏర్పాటు చేస్తామంటూ గత నాలుగైదు రోజులుగా టిఆర్ఎస్ జోరుగా హడావిడి చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే మసాలా నూరుతోంది. ఇవాళ టిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బిసి సంక్షేమ, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ప్రెస్ మీట్ పెట్టారు. బిసి అని చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ బిసిలకు ఏం చేశారని నిలదీశారు. మీడియా సమావేశంలో జోగు రామన్న మీడియా సమావేశంలో ఏం మాట్లాడారో చదవండి.

TRS targets modi from OBC angle

ప్రధాని మోడీ ఓబీసీ వర్గానికి చెందిన వారయినప్పటికీ బీసీ సంక్షేమం కోసం చేసిన ఒక్క గొప్ప పనైనా చెప్పగలరా ? దేశం దశ మార్చేందుకే కెసిఆర్ మూడో రాజకీయ ఫ్రంట్ ఆలోచన తెర పైకి తెచ్చారు. కెసిఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నపుడే ఓబీసీ మంత్రిత్వ శాఖ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. కేంద్ర మంత్రి ,ఎంపీ గా ఉండి కెసిఆర్ బీసీ ల సంక్షేమం కోసం ఎన్నో ఆలోచనలు చేశారు. చట్ట సభల్లో బీసీ లకు రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా ఓబీసీ అయిన మోడీ దానిపై స్పందించడం లేదు.

24 లక్షల కోట్ల రూపాయల కేంద్ర బడ్జెట్ లో బీసీ సంక్షేమానికి కేటాయించింది వెయ్యి కోట్ల రూపాయల లోపే కదా? రాష్ట్ర బడ్జెట్ లో బీసీ సంక్షేమానికి 5 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాము. బడ్జెట్ లో నిధుల కేటాయింపును బట్టే మోడీకి బీసీ సంక్షేమం పట్ల శ్రద్ధ ఎంత ఉందో తెలిసి పోయింది. కేంద్రం లో బీసీ కమీషన్ కు చట్టబద్ధత తేవడం లో మోడీ ప్రభుత్వం విఫలమయ్యింది. లోక్ సభ లో బీసీ కమీషన్ చట్ట బద్ధత బిల్లు ఆమోదం పొంది రాజ్యసభ లో పెండింగ్ లో ఉండటం మోడీ వైఫల్యమే. రిజర్వేషన్ల పెంపు పై కేంద్రం నిర్ణయం తీసుకోకుండా తెలంగాణ కు మోడీ అన్యాయం చేస్తున్నారు.

కుల వృత్తులను సీఎం కెసిఆర్ కాపాడుతుంటే ప్రధాని మోడీ వాటికి ఊతమిచ్చే ఒక్క చర్యను కూడా ప్రకటించ లేదు. ఎంబీసీ లకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించిన ఘనత సీఎం కెసిఆర్ దే. ఓబీసీ కమీషన్ కు ఇప్పటికైనా కేంద్రం చట్టబద్దత కల్పించాలి. టిఆర్ఎస్  ప్లీనరీ వేదిగ్గా జాతీయ నాయకుల సమక్షం లో కొత్త ఫ్రంట్ పై ప్రకటన వస్తుందనే వార్త తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం.

Follow Us:
Download App:
  • android
  • ios