హైదరాబాద్:  నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతు సంఘాలు ఈ నెల 8వ తేదీన తలపెట్టిన భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్టుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.

నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ తో రైతు సంఘాలు 11 రోజులుగా న్యూఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్నాయి. శనివారం నాడు  రైతు సంఘాలతో కేంద్రం నిర్వహించిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సోమవారం నాడు మరోసారి రైతు సంఘాలతో కేంద్రం చర్చించనుంది.

also read:రైతుల ఆందోళనలు: పద్మ విభూషణ్‌ వెనక్కి ఇచ్చిన పంజాబ్ మాజీ సీఎం

రైతులు తలపెట్టిన భారత్ బంద్ కార్యక్రమానికి తాము సంపూర్ణ మద్దతును ఇస్తున్నట్టుగా టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం నాడు ప్రకటించారు.  రైతులు న్యాయపరమైన ఆందోళన కొనసాగిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

భారత్ బంద్ లో టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొనాలని ఆయన కోరారు.నూతన వ్యవసాయ చట్టాలు రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని  ఆయన చెప్పారు.కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహారించుకొనేంతవరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలిపారు. భారత్ బంద్ ను విజయవంతం చేయాలని  కేసీఆర్ పార్టీ శ్రేణులను కోరారు.