సిరిసిల్ల మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసిన సామల పావని కంట తడి పెట్టారు. ఎలక్ర్టానిక్ మీడియా సాక్షిగా ఆమె మున్సిపాలిటీల్లో అవినీతి ఎలా జరుగుతుందో కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. ఏకంగా ఈ వ్యవహారంలోకి మంత్రి కేటిఆర్ ను కూడా ఇరికించేశారు. కేటిఆర్ చెప్పడంతోనే తాము రెండు, మూడు శాతం పర్సెంటేజీలు తీసుకుంటున్నామని నర్మగర్భంగా కామెంట్ చేశారు.

అయితే ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో దుమ్ము రేపాయి. మంత్రి కేటిఆర్ మీద రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు ఎక్కు పెట్టారు. ఈ పరిస్థితుల్లో ఆమె నిజం చెప్పినందుకు క్షణాల్లో తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు ప్రకటించారు. అయితే రెండోసారి మీడియా ముందుకు వచ్చారు పావని. తాను అనని మాటలను ఎలక్ర్టానిక్ మీడియాలో గ్రాఫిక్స్ చేసి వేశారని అన్నారు. అయితే ఆమె ఆరోపణల్లో ఏమాత్రం బలం లేదన్నట్లు మాట్లాడారు. రెండోసారి మీడియా సమావేశంలో పావని కంటతడి పెట్టారు. బీరబోయిన గొంతుతో, బాధను దిగమింగుకుని మాట్లాడారు. ఆమె రెండోసారి మీడియా సమావేశంలో ఏం మాట్లాడారో చూడండి వీడియోలో.