Asianet News TeluguAsianet News Telugu

లింగోజిగూడ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ దూరం.. కేటీఆర్ కీలక నిర్ణయం

ఈ నెల 30 జరనున్న లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ దూరంగా వుంటున్నట్లు ప్రకటించింది. శుక్రవారం మంత్రి కేటీఆర్‌ను మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నేత రామ్‌‌చందర్ రావు, ఆకుల రమేశ్ కుటుంబసభ్యులు కలిశారు.

trs party not contesting in lingojiguda division by poll ksp
Author
Hyderabad, First Published Apr 16, 2021, 9:01 PM IST

ఈ నెల 30 జరనున్న లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ దూరంగా వుంటున్నట్లు ప్రకటించింది. శుక్రవారం మంత్రి కేటీఆర్‌ను మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నేత రామ్‌‌చందర్ రావు, ఆకుల రమేశ్ కుటుంబసభ్యులు కలిశారు.

ఉప ఎన్నిక సందర్భంగా ఏకగ్రీవానికి సహకరించాలని వారు మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి ఉప ఎన్నికల్లో పోటీ చేయదని చెప్పారు. దీంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ఆకుల రమేష్ గౌడ్ మరణించడం దురదృష్టకరం అన్నారు. వారి అకాల మరణం వల్ల వచ్చిన ఈ ఎన్నికల్లో పోటీ పెట్టవద్దు అని బీజేపీ విజ్ఞప్తిని కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళి వారి సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం అని కేటీఆర్ తెలిపారు.

మానవతా దృక్పథంతో ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కి బీజేపీ ప్రతినిధి బృందం, ఆకుల రమేష్ గౌడ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుంచి గెలిచిన బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ చనిపోయారు. ఆయన గత కొంతకాలంగా కరోనాతో బాధపడుతున్నారు.

Also Read:హైదరాబాద్‌: బీజేపీ కార్పోరేటర్ మృతి.. ఇంకా జరగని ప్రమాణ స్వీకారం

ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రమేష్ గౌడ్ కన్నుమూశారు. లింగోజిగూడ నుంచి రమేష్ గౌడ్ పోటీ చేసి తన ప్రత్యర్థి సిట్టింగ్ కార్పొరేటర్ అయిన టీఆర్ఎస్ నేత ఎం.శ్రీనివాసరావు మీద గెలుపొందారు.

ఇక్కడ మొత్తం 8 మంది పోటీ చేశారు. బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, జనసేన, ఇతరులు ముగ్గురు పోటీ చేశారు. అయితే, రమేష్ గౌడ్‌కు ప్రజలు పట్టం కట్టారు. అయితే, ఆయన ప్రమాణస్వీకారం చేయకుండానే కన్నుమూశారు.

2020 డిసెంబర్‌లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ తలపడ్డాయి. ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ 55, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 సీట్లు గెలుచుకున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios