కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు. ఇన్నాళ్లూ కేంద్రానికి సహకరించామని.. ఇకపై ఏం అంశంలోనూ రాజీపడమని ఆయన స్పష్టం చేశారు.

పార్లమెంట్‌లో తామేం చేస్తామో.. మీరే చూస్తారని కేకే వ్యాఖ్యానించారు. సమస్యలపై రాజీ పడేది లేదని... జీఎస్టీ బకాయిలు ఇవ్వకపోతే ఎలా ఊరుకుంటామని ఆయన నిలదీశారు.

తమకు ప్రజలే ముఖ్యమని కేశవరావు స్పష్టం చేశారు. కేంద్రం అసమర్థత వల్ల రాష్ట్రాలు, ప్రజలు ఇబ్బంది పడాలా అని ఎంపీ ప్రశ్నించారు. 

అంతకుముందు ప్రగతి భవన్‌లో టీఆర్ఎస్ ఎంపీలు, కీలక నేతలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు.