టీఆర్ఎస్ ఎంపీ కవిత ఏపీ రాజధాని అమరావతికి వచ్చి చేసిన ప్రసంగం అధికార టీడీపీ పార్టీని ఇరకాటంలో పడేస్తే... అక్కడున్న ఆంధ్రా ప్రజలను మాత్రం బాగా ఆకట్టుకుంది. ఇంతకీ తెలంగాణ బిడ్డ ఆంధ్రా రాజధానిలో ఎం మాట్లాడింది. ఆంధ్రా ప్రజలు మెచ్చిన ఆమె ప్రసంగం టీడీపీ బ్యాచ్ కు ఎందుకు నచ్చలేదు...?
టీఆర్ఎస్ ఎంపీ కవిత ఏపీ రాజధాని అమరావతికి వచ్చి చేసిన ప్రసంగం అధికార టీడీపీ పార్టీని ఇరకాటంలో పడేస్తే... అక్కడున్న ఆంధ్రా ప్రజలను మాత్రం బాగా ఆకట్టుకుంది. ఇంతకీ తెలంగాణ బిడ్డ ఆంధ్రా రాజధానిలో ఎం మాట్లాడింది. ఆంధ్రా ప్రజలు మెచ్చిన ఆమె ప్రసంగం టీడీపీ బ్యాచ్ కు ఎందుకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది...?
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కవిత మాట్లాడుతూ... ఇక్కడకు వస్తే ఆధునిక మహిళ చరిత్ర తిరగరాస్తుందని గురజాడ అప్పారావు చేసిన వ్యాఖ్యలు గుర్తుకొస్తున్నాయన్నారు.
మహిళను ఇంటి మహారాణి గా పిలుస్తారు, చివరకు వంటింటికి రాణి చేసారు. అయితే వంట గదిలోని సామాన్ల పై తండ్రి పేరు ఉంటుంది, వంటగది పాత్రలపై కూడా తల్లి పేరు వున్నపుడే నిజమైన మహిళా సాధికారతవస్తుందని పేర్కొన్నారు.
అయితే, ఆమె ఇలా మహిళాసాధికారత గురించి మాట్లాడుతూనే ఏపీ ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించారు. ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చితీరాల్సిందేనని డిమాండ్ చేశారు . ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు తమ తరఫున పూర్తిస్థాయిలో మద్దతిస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఏపీకి అన్ని విధాలా తాము అండగా ఉంటాం.. అందరం కలిసి మెలిసి ఉందామని అన్నారు. ఈ మాటలతో అక్కుడున్న ప్రజలు కవితకు చప్పట్లతో జై కొట్టారు.
అయితే అక్కడ అధికారం చెలాయిస్తున్న టీడీపీ పార్టీ ఒక వైపు ప్రత్యేక ప్యాకేజీకే సై అంటోంది. ఈ సమయంలో కవితక్క చేసిన వ్యాఖ్యలు అక్కడున్న తెలుగు తమ్ముళ్లను బాగా ఇబ్బందిపెట్టాయిట. ఆంధ్రా ప్రజల వాంఛను తెలంగాణ బిడ్డ చెబుతుంటే దానికి మద్దతు పలికే స్థితి కూడా తమకు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారట. ఖర్చు మాకైతే క్రెడిట్ మాత్రం కేసీఆర్ కూతురు కొట్టేసిందని వాపోతున్నారట.
కాగా, కవిత అంతకు ముందు బెజవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో సూర్యకుమారి ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దుర్గమ్మకి ప్రత్యేక పూజలు చేసి సారె సమర్పించారు.
