Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ మౌనం: అంతుచిక్కని డి.శ్రీనివాస్ వ్యూహం

టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ కొంపల్లిలో సోమవారం నాడు తన అనుచరులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం ఆధారంగా తన వ్యూహన్ని ప్రకటించనున్నట్టు డీఎస్ తన అనుచరులకు స్పష్టం చేశారు.

TRS MP D.Srinivas holds meet with his followers in Kompally


హైదరాబాద్:రాజ్యసభ సభ్యుడు  డి. శ్రీనివాస్  వేచిచూసే ధోరణిని అవలంభిస్తున్నాడు.  నిజామాబాద్ జిల్లాకు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు  డి. శ్రీనివాస్ పై  సీఎంకు ఫిర్యాదు చేశారు.  ఈ ఫిర్యాదుపై సీఎం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.  సీఎం నిర్ణయం ఎలాంటి నిర్ణయం తీసుకొంటారనే విషయమై  డి. శ్రీనివాస్ ఎదురుచూస్తున్నారు. సీఎం నిర్ణయం ఆధారంగా భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. సోమవారం నాడు  తనను కలిసిన అనుచరులతో ఈ విషయాన్ని  డి.శ్రీనివాస్  స్పష్టత ఇచ్చారు.

గత నెలలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ కవిత నేతృత్వంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు సమావేశమయ్యారు.ఈ సమావేశంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగిస్తున్న డి.శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు.  ఈ లేఖపై సీఎం కేసీఆర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. డి. శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు  ప్రయత్నాలు చేస్తున్నారని టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఆ లేఖలో ఆరోపణలు చేశారు. 

అయితే ఈ విషయమై సీఎం కేసీఆర్ ను కలవాలని డి.శ్రీనివాస్ భావిస్తున్నారు. కానీ, డీఎస్‌కు ఇంతవరకు సీఎం అపాయింట్‌మెంట్ లభించలేదు. తనపై  టీఆర్ఎస్ కు చెందిన ప్రజాప్రతినిధులు చేసిన ఆరోపణలను డి.శ్రీనివాస్ తప్పుబట్టారు. ఏదైనా విషయాలు ఉంటే తనను నేరుగా సంప్రదిస్తే ప్రయోజనం ఉంటుందని డి.శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.

అయితే సీఎం అపాయింట్ మెంట్ ఇంతవరకు డి.శ్రీనివాస్ కు లభించలేదు. దీంతో హైద్రాబాద్ కొంపల్లిలో తన అనుచరుడికి చెందిన ఓ హోటల్‌లో డి.శ్రీనివాస్  నిజామాబాద్ జిల్లాలోని పలు నియోజకవర్గాలకు చెందిన నేతలతో సమావేశమయ్యారు.నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలతో డీఎస్‌ రహస్యంగా భేటీ అయ్యారు. నిజామాబాద్‌, దర్పల్లి, డిచ్‌పల్లి, సిరికొండ, జక్రాన్‌పల్లి, ఇందల్‌వాయి, మోపాల్‌ మండలాలకు చెందిన ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ప్రజాప్రతినిధులు డి.శ్రీనివాస్ తో సమావేశంలో పాల్గొన్నారు.

తనపై టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదుపై ఇంకా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోలేదు.  అపాయింట్‌మెంట్ కూడ ఇవ్వకపోవడంపై  డి.శ్రీనివాస్ తో అనుచరులు చర్చించారు. అయితే టీఆర్ఎస్ నాయకత్వం ఏదైనా చర్యలు తీసుకొంటే కాంగ్రెస్ పార్టీలో చేరాలని డి.శ్రీనివాస్ కు  అనుచరులు సూచించారని సమాచారం.

 ఎమ్మెల్సీ భూపతిరెడ్డి విషయంలో కూడ  టీఆర్ఎస్ నాయకత్వం తొందరపడి వ్యవహరించిందని కొందరు  నేతలు డి.శ్రీనివాస్ దృష్టికి తీసుకొచ్చారు.మీ విషయంలో కూడ టీఆర్ఎస్ నాయకత్వం ఇదే రీతిలో వ్యవహరిస్తోందని వారు గుర్తు చేశారు. 

అయితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నుండి కూడ తనకు పార్టీలో చేరాలని ఆహ్వానం వచ్చిన విషయాన్ని డీఎస్ ఈ సమావేశంలో ప్రస్తావించినట్టు సమాచారం. అయితే  సీఎం కేసీఆర్ ఏ రకమైన నిర్ణయం తీసుకొంటారనే దానిపై  ఆధారపడి తన భవిష్యత్ నిర్ణయం ఉంటుందని డీఎస్ ఈ సమావేశంలో అనుచరులకు తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరితే  జాతీయస్థాయిలో మంచి పదవే తనకు దక్కుతోందని డీఎస్ ఈ సమావేశంలో అనుచరులకు స్పష్టత ఇచ్చారని సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios