రేవంత్ కి సేవా జ్యోతి అవార్డును అందించిన టీఆర్ఎస్ ఎంపి

trs mp banda prakash presents seva jyothi ratna award to revanth
Highlights

రేవంత్ పై ప్రశంసల వర్షం కురిపించిన ఎంపి...

వరంగల్ జిల్లాలో సామాజిక కార్యకర్తగా మంచి పేరున్న బానోతు రేవంత్ కు కంకనాల జ్యోతి చారిటబుల్ ట్రస్ట్ నేవాజ్యోతిరత్న అవార్డును అందించింది. ఈ అవార్డును రేవంత్ రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్ చేతులమీదుగా తీసుకున్నారు.

హన్మకొండలోని వాగ్దేవి కాలేజీలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీతో పాటు మరికొందరు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండా ప్రకాష్ మాట్లాడుతూ... సామాజిక కార్యక్రమాలతో  పేదలకు అండగా నిలుస్తున్న రేవంత్ ని ప్రశంసించారు. ఆయనకి ప్రభుత్వం తరపున ఎలాంటి సాయం కావాలన్నా చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు.

బానోతు రేవంత్ ''యంగ్‌ఫర్‌ ఇండియా రన్‌ఫర్‌ ఇండియా'' స్వచ్ఛంధ సంస్థను స్థాపించి దీని ద్వారా జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. మారుమూల గ్రామాల్లో మెడికల్ క్యాంపులు పెడుతూ పేదలకు ఉచిత వైద్యం అందేలా చేస్తున్నారు.  అలాగే రక్తదానం, కళ్ళ దానం వంటి కార్యక్రమాలను చేపడుతూ జిల్లా అధికారులచే ప్రశంసలు అందుకుంటున్నారు.  కొన్ని సంవత్సరాలుగా ఆయన అలుపెరగకుండా పలు సామాజిక చైతన్య కార్యక్రమాలను చేపడుతున్నారు. 

దీంతో రేవంత్ సేవా గుణాన్ని ప్రశంసిస్తూ కంకనాల జ్యోతి చారిటబుల్ ట్రస్ట్ నేవాజ్యోతిరత్న అవార్డుకు ఎంపిక చేసింది. ఇలా సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న యువతను ప్రోత్సహించడానికే ఈ అవార్డును ఇవ్వడాన్ని ప్రారంభించినట్లు ట్రస్టు సభ్యులు తెలిపారు.

loader