తెలంగాణ తలవంచదు, విచారణకు సహకరిస్తా: ఈడీ నోటీసులపై కవిత


ఢిల్లీ లిక్కర్ స్కాంలో  తనకు  ఈడీ నోటీసులు  జారీ అయిన  విషయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత  ప్రకటించారు. విచారణకు  సహకరిస్తానన్నారు

TRS MLC Kalvakuntla Kavitha Reacts On Enforcement Directorate Notice


హైదరాబాద్:  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  తనకు  ఈడీ నోటీసులు అందాయని   బీఆర్ఎస్  ఎమ్మెల్సీ కవిత  ప్రకటించారు.  ఎల్లుండి  ఢిల్లీలో  ధర్నా  ఉన్న నేపథ్యంలో  విచారణకు  వెళ్లే విషయమై  న్యాయ సలహ తీసుకుంటానని  ఆమె  చెప్పారు.  

 

ఈ విషయమై  ట్విట్టర్ వేదికగా  కవిత  స్పందించారు.  దర్యాప్తు సంస్థలకు  పూర్తిగా సహకరిస్తానని  ఆమె  పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేకత , అణచివేత చర్యలకు  తెలంగాణ  ఎప్పుడూ తలవంచదని చెప్పారు.ఇలాంటి  చర్యలతో  కేసీఆర్ , బీఆర్ఎస్ ను లొంగదీసుకోవడం  కుదరదని  బీజేపీ తెలుసుకోవాలని  కవిత   పేర్కొన్నారు.బీజేపీ వైఫల్యాలను  ఎండడగడుతూనే  ఉంటామని  చెప్పారు.  

ఈ  నెల  10వ తేదీన ఢిల్లీలో  జంతర్ మంతర్  వద్ద  ధర్నా కు పిలుపునిచ్చిన నేపథ్యంలో  తనకు  ఈడీ అధికారులు  ఈ నెల  9వ తేదీన విచారణకు  రావాలని నోటీసులు ఇచ్చారని  ఆమె పేర్కొన్నారు. 

also read:ఈడీ నోటీసులు: కాసేపట్లో కేసీఆర్‌తో భేటీ కానున్న కవిత

ఈ నెల  9వ తేదీన  తనకు  ముందుగా నిర్ణయించుకున్న  కార్యక్రమాలున్నాయని కవిత  పేర్కొన్నారు.  ఈడీ విచారణకు  హజరు విషయమై  న్యాయ సలహ దీసుకుంటానని  కవిత  పేర్కొన్నారు.  చట్టాన్ని గౌరవించి  దర్యాప్తు సంస్థలకు  తాను  సహకరించనున్నట్టుగా  కవిత  పేర్కొన్నారు. చట్టాన్ని గౌరవించే  వ్యక్తిగా  విచారణకు  సహకరిస్తానని ఆమె  పేర్కొన్నారు. దేశ అభ్యున్నతి  కోసం  గొంతెత్తుతూనే ఉంటామని కవిత  స్పష్టం  చేశారు.ప్రజా వ్యతిరేక  ప్రభుత్వానికి  తెలంగాణ ఎప్పటికీ  తలవంచదని  కవిత  చెప్పారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios