హైదరాబాద్:  ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోరారు.

మంగళవారం నాడు ఆమె బంజారాహిల్స్ లోని రోడ్డు నెంబర్ 14 లో బీఎస్‌డీఏవీ పబ్లిక్ స్కూల్ లో  ఓటు హక్కును వినియోగించుకొన్నారు.  ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యం లేని ప్రజాస్వామ్యం పరిపూర్ణం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. 

also read:కూకట్‌పల్లిలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ: ఉద్రిక్తత

చలితో పాటు కరోనా  కారణంగా ఉదయం పూట  పోలింగ్ శాతం తక్కువగా నమోదైనట్టుగా  ఆమె అభిప్రాయపడ్డారు. ఓటర్లు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొనాలని ఆమె ప్రజలను కోరారు. మధ్యాహ్నం తర్వాత ఓటర్లు పెద్ద ఎత్తున ఓటింగ్ కోసం పోలింగ్ కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. సాయంత్రానికి పెద్ద ఎత్తున  ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వస్తారని ఆమె ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

హైద్రాబాద్ లో ఎప్పుడూ కూడ పోలింగ్ శాతం తక్కువగా నమోదౌతుంటుంది... కానీ ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు.