Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు సీబీఐతో విచారణ: తీర్పును రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు

ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును సీబీఐతో విచారణ నిర్వహించాలని దాఖలైన పిటిషన్లపై  వాదనలు ముగిశాయి.  తీర్పును తెలంగాణ హైకోర్టు రిజర్వ్ చేసింది. 

 trs mlas poaching case:Telangana Hiigh Court  Reserves  Verdict
Author
First Published Dec 16, 2022, 4:14 PM IST

హైదరాబాద్: ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో  సీబీతో విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్లపై వాదనలు ముగిశాయి.  ఈ విషయమై  తెలంగాన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.  ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును సీబీఐతో విచారణ చేయించాలని  బీజేపీ సహా  పలువురు పిటిషన్లు దాఖలు చేశారు.ఈ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహించింది.  ఈ విచారణపై అన్ని వర్గాల వాదనలను హైకోర్టు వింది.  తుది వాదనలను  ఇవాళ్టితో పూర్తయ్యాయి. తీర్పును  హైకోర్టు రిజర్వ్ చేసింది.

ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుపై ఇవాళ తుది విచారణ  వింటామని నిన్ననే తెలంగాణ హైకోర్టు తెలిపింది. ఇవాళ ఉదయమే విచారణను ప్రారంభించింది.  ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు విషయమై  సీఎం మీడియా సమావేశానికి  సీడీలు ఎక్కడి నుండి తీసుకున్నారని పిటిషనర్ల తరపు న్యాయవాది ప్రశ్నించారు.  65 బీ ఎవిడెన్స్ యాక్ట్ కింద సర్టిఫికెట్ లేదని  సిట్ తరపు న్యాయవాది  హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో ఇవాళ సాయంత్రానికి  సర్టిఫికెట్ ను సమర్పించాలని హైకోర్టు  ఆదేశించింది.  సాయంత్రం ఇరువర్గాల వాదనలను హైకోర్టు వింది.ఈ కేసును సీబీఐతో లేదా  స్వతంత్ర విచారణ సంస్థతో  జరిపించాలని  బీజేపీ సహా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు.  సిట్ విచారణ సీఎం కనుసన్నల్లో  సాగుతుందని  పిటిషనర్ల తరపు న్యాయవాదులు  చెప్పారు. ఈ వాదనలను సిట్ తరపు న్యాయవాదులు తోసిపుచ్చారు.

ఈ ఏడాది అక్టోబర్  26వ తేదీన మొయినాబాద్ ఫాం హౌస్ లో  బీఆర్ఎస్( టీఆర్ఎస్) ఎమ్మెల్యేల ను ప్రలోభాలను గురి చేస్తున్నారనే ఆరోపణలతో  ముగ్గురు అరెస్టయ్యారు. రామచంద్రభారతి,  నందకుమార్,  సింహాయాజీలను మొయినాబాద్ పోలీసులు అరెస్ట్  చేశారు. తాండూరు ఎమ్మెల్యే పైలెల్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం  సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ తో కాకుండా సీబీఐ విచారణ చేయించాలని  బీజేపీ పిటిషన్ వేసింది. ఇదే కేసులో  మరికొందరు కూడా సిట్ విచారణ కాకుండా సిబీఐ విచారణ కోరుతూ  పిటిషన్లు దాఖలు చేశారు. 

also readLఎమ్మెల్యేల కొనుగోలు కేసు : బీఎల్ సంతోష్, జగ్గుస్వామి సిట్ నోటీసులపై స్టే పొడిగింపు

ఈ కేసులో  అన్ని వర్గాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్  చేసింది.  సిట్ తరపున  ధవే  వాదనలను విన్పించారు.  బీజేపీ తరపున  మహేష్ జెఠ్మలానీ వాదించారు.ఈ కేసుకు సంబంధించి  పలువురికి  సిట్  బృందం  నోటీసులు జారీ చేసింది.  బీజేపీ అగ్రనేత  బీఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్ లకు  సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను ఈ ముగ్గురు హైకోర్టులో  సవాల్ చేశారు. సిట్ నోటీసులపై  హైకోర్టు స్టే  కూడా విధించిన విషయం తెలిసిందే.
 

Follow Us:
Download App:
  • android
  • ios