tahsildar Vijaya Reddy: మల్ రెడ్డిపై మంచిరెడ్డి సంచలన ఆరోపణలు
అబ్దుల్లాపూర్‌మెట్టు ఎమ్మార్వో విజయారెడ్డి సజీవదహనం కేసు రాజకీయ రంగు పులుముకొంది.మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
హైదరాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్టు ఎమ్మార్వో విజయా రెడ్డి సజీవ దహనం ఘటన రాజకీయ రంగు పులుముకొంది. విజయా రెడ్డిని హత్య చేసిన సురేష్ తండ్రి వద్ద మల్‌రెడ్డి రంగారెడ్డి బంధువులు కొనుగోలు చేశారని ఆయన చెప్పారు. తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని ఆయన సవాల్ విసిరారు.
Also read:విజయారెడ్డి హత్య ఎఫెక్ట్: ఆంధ్ర ఎమ్మార్వోల ముందు జాగ్రత్త
ఈ ఘటనపై వాస్తవాలు ఏమిటో పోలీసుల విచారణలో తేలుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చెప్పారు. బుధవారం నాడు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, బంధువులు కబ్జా చేశారని ఆయన ఆరోపించారు.గౌరెల్లి గ్రామంలోని 70 నుండి 101 సర్వే నెంబర్లపై విచారణ జరింపించాలని మంచిరెడ్డి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
AlsoRead విజయారెడ్డి అంత్యక్రియల్లో...సీఎం కేసీఆర్ కి చేదు అనుభవం...
అబ్దుల్లాపూర్‌మెట్టు ఎమ్మార్వో విజయా రెడ్డి సజీవ దహనం కేసులో విచారణ చేయించాలని సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర అధికారులను లేఖ రాస్తున్నట్టుగా ఆయన చెప్పారు.
మల్‌రెడ్డి రంగారెడ్డి కుటుంబానికి వారసత్వంగా వచ్చింది 8 ఎకరాల భూమి మాత్రమే అని చెప్పారు. గౌరెల్లి గ్రామానికి చెందిన 60 రైతులు తన వద్దకు వచ్చినట్టుగా ఆయన చెప్పారు. గౌరెల్లి గ్రామానికి చెందిన 60 మంది రైతులను తీసుకొని తాను జాయింట్ కలెక్టర్ వద్దకు తీసుకెళ్లినట్టుగా ఆయన చెప్పారు.
AlsoRead వెనుక గేటు నుండి వచ్చి ఎమ్మార్వో విజయా రెడ్డిని సజీవ దహనం చేసిన సురేష్...
తనపై మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి చేసిన ఆరోపణలను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మల్‌రెడ్డి రంగారెడ్డి చేసిన ఆరోపణలపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కొన్ని ఆధారాలను మీడియా సమావేశంలో ఇచ్చారు.
తన చేతిలో మూడు దఫాలు ఓడిపోయిన మల్‌రెడ్డి రంగారెడ్డి నిరాశతో విమర్శలు చేస్తున్నారని మంచిరెడ్డి కిషన్ రెడ్డి చెప్పారు.తనపై కక్షపూరితంగా మల్‌రెడ్డి రంగారెడ్డి విమర్శలు చేస్తున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చెప్పారు.గౌరెల్లి గ్రామంలోని వివాదాస్పద భూములపై విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.