విజయారెడ్డి అంత్యక్రియల్లో...సీఎం కేసీఆర్ కి చేదు అనుభవం

ఈ అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్ కి చేదు అనుభవం ఎదురైంది. విజయారెడ్డి సొంత ప్రాంతమైన నాగోల్ లో ఈ కార్యక్రమం నిర్వహించగా... రెవిన్యూ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసేపు విజయారెడ్డి జోహార్లు పలికిన ఉద్యోగులు.. తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు.

Revenue staff flay CM during MRO ViajayaReddy  funeral

ఇటీవల కార్యాలయంలోనే దారుణ హత్యకు గురైన విజయారెడ్డి అంత్యక్రియలు మంగళవారం నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయారెడ్డి కుటుంబసభ్యులు, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాగా... ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆమె మృతికి సంతాపం తెలియజేశారు. ఇది చాలా హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు.

అయితే... ఈ అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్ కి చేదు అనుభవం ఎదురైంది. విజయారెడ్డి సొంత ప్రాంతమైన నాగోల్ లో ఈ కార్యక్రమం నిర్వహించగా... రెవిన్యూ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసేపు విజయారెడ్డి జోహార్లు పలికిన ఉద్యోగులు.. తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు.

 సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగానే ఇలా జరిగిందంటూ ఉద్యోగులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి. అంతేకాకుండా తమ రెవిన్యూ ఉద్యోగలకు  భద్రత లేకుండా పోయిందని వారు వాపోయారు. తమకు కనీస భద్రత కల్పించాలంటూ ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. కొద్దిసేపు ఆ ప్రాంతంలో వారు రాస్తారోకో కూడా నిర్వహించారు.

Also read:tahsildar Vijaya Reddy: అందుకే పెట్రోల్ పోసి నిప్పంటించానని సురేష్

కాస్త... పరిస్థితులు తీవ్రతరం కాకుండా అదుపుచేసేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారి రాస్తారోకో, ఆందోళన కార్యక్రమాలను విరమింపచేశారు. 

కాగా...సోమవారం మధ్యాహ్నం.. విజయారెడ్డిని సురేష్ అనే వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయా రెడ్డిని ఆమె కార్యాలయంలో, ఆమె చాంబర్లో తలుపులు వేసి, పెట్రోలు పోసి కాల్చి చంపేశాడు. ఆమె మధ్యాహ్న భోజనం చేస్తున్న సమయంలో మాట్లాడే నెపంతో వచ్చి ఈ దౌర్జన్యానికి ఒడిగట్టాడు. కౌలు రైతుకు, భూ యజమానికి మధ్య తలెత్తిన వివాదంలో ఆమె బలైపోయారు.

Also Read:విజయారెడ్డి హత్య వెనుక టీఆర్ఎస్: కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తనకు పట్టా రాదనే ఉద్దేశంతోనే ఆమెను చంపినట్టు కౌలు రైతు సురేశ్‌ చెప్పాడు. మంటలు అంటుకున్న విజయారెడ్డిని రక్షించేందుకు ప్రయత్నించిన డ్రైవర్‌ కూడా ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ మృతి చెందడం గమనార్హం. నిందితుడు సురేష్ కూడా 60శాతం గాయపడగా... అతను ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్నాడు. భూ వివాదంలో తహసీల్దార్ తనకు మద్దతు ఇవ్వనందుకే చంపేసినట్లు సురేష్ అంగీకరించాడు. కాగా.. సురేష్ వెనక మరెవరైనా ఉన్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతని కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios