Asianet News TeluguAsianet News Telugu

Huzurabad Bypoll: ఓటర్ల అకౌంట్ కే డబ్బులు... ఇదీ ఈటల ప్లాన్: ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు

అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బిజెపి నాయకులు ఆరోపణలు, ప్రత్యారోపణలో హుజురాబాద్ రాజకీయాలు రోజురోజుకు మరింత హీటెక్కుతున్నాయి. పోలింగ్ కు సమయం దగ్గరపడుతుంటంతో డబ్బులు పంచడానికి సిద్దమయ్యారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. 

TRS MLA Kranthi Kiran and Other complains EC against BJP Candidate Eatala Rajender
Author
Hyderabad, First Published Oct 22, 2021, 2:25 PM IST

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న తరుణంలో బిజెపి అక్రమాలకు తెరలేపుతోందంటూ టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని వివిధ బ్యాంకుల్లో కొత్తగా బ్యాంక్ అకౌంట్లు తెరిచి అందులో డబ్బులు జమచేస్తున్నారని... ఈ అకౌంట్ నుండే ఓటర్ల అకౌంట్ కి డబ్బులు పంపాలని ప్లాన్ చేసినట్లు తెలిపారు. ఇలా బిజెపి గుట్టుగా ఓటర్లకు డబ్బులు పంచే ఏర్పాటు చేసిందంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ కు టీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేసింది. 

హైదరాబాద్ లోని బుద్ద భవన్ లో chief electoral officer shashank goyal ని కలిసి టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నేత గట్టు రామచంద్రరావు మాజీ మంత్రి, బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ పై ఫిర్యాదు చేసారు. eatala rajender సన్నిహితుడైన భద్రయ్య వివిధ పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నట్లు తమకు ఖచ్చితమైన సమాచారం వుందని తమ పిర్యాదులో పేర్కొన్నారు TRS నేతలు.  

READ MORE  హుజురాబాద్‌: అన్ని పథకాలు అమలౌతున్నాయి.. దళితబంధునే ఆపారు, ఈసీ నిర్ణయంపై హైకోర్టులో పిల్

ఈటల రాజేందర్ అక్రమాలపై ఇప్పటికే అనేక మార్లు పిర్యాదు చేశామని గుర్తుచేసారు. ఎన్నిసార్లు పిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని... ఇప్పటికైనా తమ పిర్యాదులను పరిగణలోకి తీసుకుని తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారిని  కోరారు టీఆర్ఎస్ నేతలు. 

అయితే అధికార టీఆర్ఎస్ కూడా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోందని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఉపఎన్నికలో ఎలాగయినా గెలవాలని భావిస్తున్న అధికార పార్టీ ఒక్క  ఓటుకు రూ.20వేలు ఇవ్వడానికి సిద్దమైందని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. ఆ డబ్బులు మనవే కాబట్టి తీసుకోవాలని ... కానీ ఓటు మాత్రం బిజెపికి గుర్తు కమలానికే వేయాలని సూచిస్తున్నారు.

read more  Huzurabad Bypoll: అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ...కేసీఆర్ బొమ్మే మా గెలుపు మంత్రం: మంత్రి గంగుల (వీడియో)

అక్టోబర్ 1న హుజురాబాద్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై 8వ తేదీ వరకు కొనసాగింది. అక్టోబర్ 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 13న నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యింది. ఇక అక్టోబర్ 30న పోలింగ్, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు మిగిలివుంది. 

ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు విద్యార్థి సంఘం నాయకులను బరిలోకి దింపాయి. టీఆర్ఎస్వీ నాయకుడు gellu srinivas yadav ను టీఆర్ఎస్,  nsui నాయకుడు balmoor venkat ను కాంగ్రెస్ పోటీలో నిలిపింది. బిజెపి తరపున మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలోకి దిగారు. తాజాగా ఆయనపైనే టీఆర్ఎస్ నాయకులు ఈసీకి ఫిర్యాదు చేసారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios