Asianet News TeluguAsianet News Telugu

Huzurabad Bypoll: అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ...కేసీఆర్ బొమ్మే మా గెలుపు మంత్రం: మంత్రి గంగుల (వీడియో)

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టీఆర్ఎస్ పార్టీని, ఉద్యమ నేత కేసీఆర్ ను చూసే హుజురాబాద్ ప్రజలు తమకు ఓటేసి గెలిపిస్తారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. 
 

KCR Photo enough to win huzurabad bypoll: minister gangula kamalakar
Author
Huzurabad, First Published Oct 21, 2021, 4:01 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ బొమ్మ, టీఆర్ఎస్ జెండాతోనే హుజురాబాద్ ఉపఎన్నికలో బంపర్ మెజారిటీతో గెలవబోతున్నామని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరపరా శాఖల మంత్రి గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేసారు. telangana state వచ్చింది కాబట్టే ప్రజలకు సంక్షేమం ఫలాలు వచ్చాయన్నారు. అలాంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టీఆర్ఎస్ పార్టీని, నేత కేసీఆర్ ను చూసే హుజురాబాద్ ప్రజలు ఓటేస్తారని మంత్రి అన్నారు. 

ఇవాళ(గురువారం) huzurabad పట్టణంలోని 16 ,17వ వార్డుల్లో  మంత్రి gangula kamalakar ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం చెప్పారు. స్థానిక నాయకులు శాలువాలతో సత్కరిస్తూ మంత్రిని ఆహ్వానించారు. 

మంత్రి గంగుల ఇంటింటికి తిరుగుతూ trs ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు, rythu bandhu, రైతుబీమా, ఇరవైనాలుగ్గంటల కరెంటు, కళ్యాణలక్ష్మీ, ఆసరా పించన్లు, dalit bandhu ఇలా వందల సంఖ్యలో సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 

READ MORE  Huzurabad Bypoll: బిజెపిలో ఈటల అనుమానమే... ఈ డౌట్ కాషాయపార్టీదే: మంత్రి హరీష్ సంచలనం

ఇదే క్రమంలో కేంద్రంలో అధికారంలో వున్న BJP మోటార్లకు మీటార్లు పెడుతామంటూ వ్యవసాయ నల్లచట్టాల్ని తీసుకొచ్చిందని గుర్తుచేసారు. అలాంటి బీజేపీకి ఓటేయద్దని విజ్ణప్తి చేసారు.  పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలపై అధిక భారం మోపుతోందని... ఈ ధరల పెంపుకు బిజెపి యే కారణమన్న విషయం ప్రజలు గుర్తించాలన్నారు.

వీడియో

ఇప్పటికే తెలంగాణ ప్రజలు RR (రాజాసింగ్, రఘునందన్)  గెలిపించే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని... ఇప్పుడు మూడో R (రాజెందర్) ను అసెంబ్లీకి పంపే అవకాశమే లేదన్నారు. బిజెపి అంటున్నట్లు తెలంగాణ అసెంబ్లీలో 'RRR'సాధ్యం కాదన్నారు. గతంలో కారు గుర్తుకే ఓటేసారని... ఈసారి అంతకంటే అత్యధిక మెజార్టీతో హుజురాబాద్ లో కారు గుర్తు గెలువబోతుందన్నారు మంత్రి గంగుల. 

ఈ ప్రచార కార్యక్రమంలో మంత్రితో పాటు ఎస్సి కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కార్పోరేషన్ చైర్మన్ గందే రాధిక-శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్లు సుశీల ,ఉజ్మ- ఇమ్రాన్, స్థానిక నాయకులు జమీలుద్దీన్, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

హుజురాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ వెలువడి నామినేషన్ల ప్రారంభానికి ముందే టీఆర్ఎస్, బిజెపి ప్రచారాన్ని ప్రారంభించాయి. ఇక నోటిఫికేషన్ వెలువడిన అక్టోబర్ 1నుండి ఈ పార్టీల ప్రచారం మరింత జోరందుకుంది. పోలింగ్ కు మరో తొమ్మిదిరోజులు మాత్రమే సమయంలో వుండటంతో ఈ ప్రచారం పీక్స్ లో సాగుతోంది.అక్టోబర్ 30న పోలింగ్ జరగనుండగా నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరిగి ఫలితం వెలువడనుంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios