Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు వద్దకు సీతక్కను పంపింది రేవంతే... కాంగ్రెస్ టిక్కెట్ల కోసమేనా?: జీవన్ రెడ్డి సంచలనం

తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ ప్రధాని మోదీని కలవడంపై విమర్శలు గుప్పించిన టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విరుచుకుపడ్డారు. 

trs mla jeevan reddy fires on tpcc chief revanth reddy
Author
Hyderabad, First Published Sep 9, 2021, 12:01 PM IST

హైదరాబాద్: తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై పీయూసీ చైర్మన్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విరుచుకుపడ్డారు. చంద్రబాబు పెంచిన లిల్లీ ఫుట్ ఈ రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. రేవంత్ కు రేబిస్ వ్యాధి సోకిందని... అందువల్లే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని జీవన్ రెడ్డి విమర్శించారు.  

''దేశ ప్రధాని నరేంద్ర మోదీని సీఎం కేసీఆర్ కలవడంపై రేవంత్ రాజకీయం చేస్తున్నారు. ఫెడరల్ స్ఫూర్తి గురించి రాజ్యాంగంలో 263 ఆర్టికల్ స్పష్టంగా చెబుతోంది. కానీ రాజకీయ పరిపక్వత లేని రేవంత్ కు రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం ప్రధానిని కలవడం తప్పుగా కనిపిస్తుందా? తెలంగాణకు సంబంధించిన పన్నెండు అంశాలపై పీఎకు సీఎం కెసిఆర్ వినతిపత్రాలు ఇచ్చారు. అంతేతప్ప రేవంత్ ఆరోపించినట్లు రాజకీయాలు మాట్లాడలేదు'' అని వివరించారు. 

''ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఎంఐఎం సీట్ల గురించి వారిద్దరూ మాట్లాడుకున్నారా? అయితే పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ ఈ నెల పదకొండునే పీఎం మోడీని కలిశారు. మరి ఆయన కూడా కాంగ్రెస్ టిక్కెట్ల గురించి మోడీతో చర్చించారా? చైనా రాయబారిని కూడా మీ నాయకుడు రాహుల్ గాంధీ చాలా సార్లు కలిశారు... అయితే ఆయన దేశ ద్రోహానికి పాల్పడినట్లేనా? ఎమ్మెల్యే సీతక్కను నువ్వే చంద్రబాబు దగ్గరకు పంపావు కదా... కాంగ్రెస్ టిక్కెట్లు నిర్ణయించడానికే పంపావా?'' అంటూ జీవన్ రెడ్డి నిలదీశారు.

''పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ బిజెపితో భీకరంగా పోరాడారు... అంతమాత్రాన ఆమె మోడీని కలవలేదా? .రేవంత్ తప్పుడు ప్రచారాలు చేయడంలో గోబెల్స్ ను మించి పోయారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ ను గాసిప్స్ అడ్డాగా మార్చాడు. సోషల్ మీడియాలో తన చెంచాల ద్వారా అబద్దాలు ప్రచారం చేయిస్తున్నాడు. రేవంత్ సినిమా ల్లో ఐటెం సాంగ్ లాంటోడు. మేము సోషల్ ఇంజనీరింగ్ చేస్తుంటే... రేవంత్ సోషల్ మీడియా ఇంజనీరింగ్ చేస్తున్నాడు'' అని మండిపడ్డారు. 

read more  యూపీలో ఎంఐఎం పోటీపైనే కేసీఆర్- మోడీల చర్చ.. ఢిల్లీ టూర్‌లో సాధించిందేం లేదు : రేవంత్

''ఎంఐఎం మతతత్వం గురించి మాట్లాడుతున్నావ్... మరి కేరళలో ముస్లిం లీగ్ కాంగ్రెస్ మిత్రపక్షం... అది మతతత్వ పార్టీ కాదా? మహారాష్ట్రలో శివసేన మతతత్వ పార్టీ కాదా? ఆ పార్టీతో కాంగ్రెస్ ఎందుకు అధికారాన్ని పంచుకుంటోంది? గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ సీఎంగా వున్న ఎన్టీఆర్ ప్రధానులుగా వున్న ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీని కలవలేదా? ఇటీవలే మీ నాయకుడు రాహుల్ గాంధీ పీఎం మోడీని పార్లమెంటులో కౌగలించుకుని ముద్దులు పెట్టలేదా? అయితే బీజేపీతో కాంగ్రెస్ కుమ్మక్కయినట్లేనా? మాజీ పీఎం మన్మోహన్ సింగ్ కూడా మోడీని కలుస్తారు... అయితే కాంగ్రెస్ ను బీజేపీకి అమ్మేశారా?'' అంటూ నిలదీశారు. 

''పీసీసీ ప్రెసిడెంట్ పదవి రాగానే సరిపోదు రేవంత్... కొద్దిగా రాజకీయ పరిణతి పెంచుకో. నీకు సోకిన రేబిస్ వ్యాధికి ఎలాంటి వ్యాక్సిన్ ఇవ్వాలో మాకు తెలుసు. నోరు అదుపులో పెట్టుకోకపోతే రేవంత్ కు రాజకీయంగా పుట్టగతులుండవు'' అని హెచ్చరించారు. 

''బిజెపి ఎంపీ తేజస్వీ సూర్య మా సీఎంను తిట్టినా మంత్రి కెటీఆర్ ఆయనకు జ్ఞాపిక ఇచ్చి సత్కరించారు...ఇది ఆయన సంస్కారం. నీలాగా చిల్లర రాజకీయాలు చేయలేదు'' అంటూ రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విరుచుకుపడ్డారు. 
 
 

Follow Us:
Download App:
  • android
  • ios