తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిపికేషన్ వెలువడిన నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన పలువరు అభ్యర్థులు తమ పదవులకు రాజీనామా చేశారు. సోమవారమే రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవికి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇవాళ మరో ముగ్గురు టీఆర్ఎస్ అభ్యర్థులు కూడా ఇదే బాటలో నడిచారు. తమ పదవులకు రాజీనామా చేసి ఎన్నికల బరిలో దూకుతున్నారు. 

ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి, మిషన్ భగీరథ కార్పొరేషన్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ, సాంస్కృతిక సారధి చైర్మన్ రసమయి బాల కిషన్ లు వారి పదవులకు రాజీనామాలు ప్రకటించారు. సత్తుపల్లి నుండి పిడమర్తి , బాల్కొండ నుండి ప్రశాంత్ రెడ్డి,రామగుండం నుండి సోమారపు, మానకొండూర్ నుండి రసమయిలకు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం వచ్చింది. 

ప్రస్తుతం ఈ నాయకులంతా ఎన్నిక ప్రచారం ముమ్మరంగా పాల్గొంటున్నారు. ఇలా నామినేటెడ్‌ పదవుల్లో ఉంటూ ఎన్నికల్లో పోటీ చేస్తుండటం వల్ల ప్రోటోకాల్‌ సమస్యలు తలెత్తుతాయన్న భావంతో వీరంతా తమ పదవులకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్‌ సూచన మేరకు వీరు రాజీనామా చేశారు.  వీరితో పాటు వివిధ పదవుల్లో కొనసాగుతున్న తాటి వెంకటేశ్వర్లు, అలీ బాకురీ, ప్రేమ్ సింగ్ రాథోడ్ లు కూడా తమ బాధ్యతల నుండి తప్పుకున్నారు. 

మరిన్ని వార్తలు

వనపర్తి టీఆర్ఎస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డి రాజీనామా...