తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పోటీపడుతున్నాడు. ఈ ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రస్తుతం బిజీబిజీగా గడుపుతున్నారు. అలాగే ఇవాళ ఎన్నికల కోసం నోటిపికేషన్ వెలువడటం, నామినేషన్ల పర్వం ప్రారంభమయ్యింది. దీంతో తాను ప్రస్తుతం కొనసాగుతున్నరాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవికి సమయం కేటాయించలేకపోతున్నారు. దీంతో ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు నిరంజన్ రెడ్డి ప్రకటించారు.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

అసెంబ్లీ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలన్న ఉద్దేశంతోనే తన పదవికి రాజీనామా చేసినట్లు నిరంజన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నందున ఈ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని అన్నారు. 

 తన మీద నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పటించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఆయనిచ్చిన ఈ భాద్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాననే భావిస్తున్నానని అన్నారు. తన పదవీకాలంలో సహకరించిన అన్ని జిల్లాల అధికారులకు, ప్రత్యేకించి ఉమ్మడి పాలమూరు జిల్లాల అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు నిరంజన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.