తెలంగాణ బీజేపీ నేతలపై ఫైరయ్యారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్. బుధవారం టీఆర్ఎస్ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రికార్డు టైంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేశామనే కడుపు మంటతోనే బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని సుమన్ ఎద్దేవా చేశారు.

ఉద్యోగుల సమస్యలపై త్వరలో ఉద్యోగ సంఘాలతో కేసీఆర్ సమావేశంకానున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో శ్రీరాంసాగర్ ఎగువన మహారాష్ట్ర వందల ప్రాజెక్టులు కడుతున్నా అప్పటి టీ. కాంగ్రెస్ నేతలు ఏం చేయలేకపోయారని సుమన్ మండిపడ్డారు.

ఉత్తర, మధ్య తెలంగాణలోని బీడు భూములను తడిపేందుకు కేసీఆర్ కార్యాచరణ రూపొందించారన్నారు. కాళేశ్వరంపై జీవన రెడ్డి వ్యాఖ్యలు దారుణమని సుమన్ మండిపడ్డారు.

కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులన్నీ పెండింగ్ మయమని.. కానీ టీఆర్ఎస్ హయాంలో రన్నింగ్ మయంగా కేసీఆర్ మార్చారని తెలిపారు. కాళేశ్వరం నీళ్లు త్వరలోనే వస్తున్నాయని.. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఇక కన్నీళ్లే మిగులుతాయని సుమన్ సెటైర్లు వేశారు.