టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌లపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. ఇద్దరిలో ఒకరికి కుల పిచ్చని, మరొకరికి మత పిచ్చంటూ ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెడతానని చెప్పేసరికి కాంగ్రెస్, బీజేపీలకు వణుకు పుట్టిందని బాల్క సుమన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy), తెలంగాణ బీజేపీ (bjp) అధ్యక్షుడు బండి సంజయ్‌లపై (bandi sanjay) టీఆర్ఎస్ (trs) ఎమ్మెల్యే బాల్క సుమన్ (balka suman) తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిది కులపిచ్చి, బండి సంజయ్‌ది మతపిచ్చి అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) జాతీయ పార్టీ అనగానే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో వణుకు పుట్టిందని సుమన్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ అంటే కాలం చెల్లిన మెడిసిన్ కాదని... ప్రాణం పోసే సంజీవని అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ (congress) పని అయిపోయిందని బాల్క సుమన్ జోస్యం చెప్పారు. సోనియా గాంధీకి (sonia gandh) ఈడీ నోటీసులు ఇచ్చినా ఆ పార్టీ పోరాడటం లేదన్నారు. కొన ఊపిరితో ఐసీయూలో ఉన్నట్టుగా కాంగ్రెస్ పరిస్థితి ఉందని ఆయన తెలిపారు. బీజేపీ ఉన్మాద పార్టీ అని .. దాని దుర్మార్గాలను దేశ ప్రజల ముందు ఉంచుతామన్నారు. బీజేపీది ఢిల్లీలో తుగ్లక్ పాలన అని, గల్లీలో తుగ్లక్ వాదన అంటూ సుమన్ ఎద్దేవా చేశారు. రేవంత్ నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే బుద్ధి చెపుతారని హెచ్చరించారు. బండి సంజయ్‌కు చేతనైతే విభజన హామీ చట్టాలను అమలు చేసి చూపించాలని బాల్క సుమన్ సవాల్ విసిరారు.
ALso Read:ఎప్పుడైనా ఎన్నికలు.. తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై కేటీఆర్ సంకేతాలిచ్చేశారా..!
కాగా.. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నారనే ప్రచారం కొంతకాలంగా సాగుతున్న సంగతి తెలిసిందే. 2014 తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కేసీఆర్.. ఐదేళ్లు పూర్తికాకుండానే 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అది టీఆర్ఎస్‌కు కలిసివచ్చింది. గతంతో పోలిస్తే టీఆర్ఎస్ విజయం సాధించిన సీట్ల సంఖ్య కూడా పెరిగింది. అయితే గతంలో మాదిరిగానే ఈసారి కూడా కేసీఆర్.. ముందస్తు ఆలోచనలో ఉన్నారని.. ఇప్పటికే ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ సర్వేలు చేయిస్తుందని వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నిన్న ఖమ్మం జిల్లాలో పర్యటించిన కేటీఆర్.. అక్కడ అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకుని.. పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరారవు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పాల్గన్నారు.
ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర అసెంబ్లీకి ఎప్పుడైనా ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున పోరాటానికి సిద్దంగా ఉండాలని నాయకులకు సూచించారు. అంతేకాకుండా జిల్లాలో పార్టీని మరింతగా బలోపేతం చేసే విధంగా నాయకులకు కేటీఆర్ మార్గనిర్దేశనం చేశారు. అవసరమైన చోట కొన్ని మార్పులు తప్పవని స్పష్టం చేశారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని చెప్పారు. కుమ్ములాటలు మానేసి, వచ్చే ఎన్నికల్లో పార్టీ భవిష్యత్తు మరింత మెరుగుపరిచేలా పని చేయాలని సూచించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10కి 10 స్థానాలను గెలుచుకోవాలని చెప్పారు. గత ఎన్నికల్లో ఇతర జిల్లాల్లో 13 సీట్లుంటే 12 గెలుచుకున్నామని, ఖమ్మంలో మాత్రం 10 సీట్లుంటే ఒకటి మాత్రమే గెలిచామని.. ఈసారి ఆ పరిస్థితి మారాలని స్పష్టం చేశారు.
