హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి సతీమణికి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గండ్ర వెంకట రమణారెడ్డి టీఆర్ఎస్ లో చేరితే ఆయన భార్యకు పదవి ఇస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

గండ్ర వెంకటరమణా రెడ్డి టీఆర్ఎస్ లోకి వస్తే ఆయన సతీమణికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో 32 జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవులను కైవసం చేసుకునే వ్యూహంలో భాగంగా టీఆర్ఎస్ నాయకత్వం కాంగ్రెసు ఎమ్మెల్యేలకు గాలం వేసింది.

కాంగ్రెసు భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి, సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య టీఆర్ఎస్ లో చేరడానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్త

కాంగ్రెసుకు భారీ షాక్: టీఆర్ఎస్ లోకి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు