రాబోయే గ్రేటర్ ఎన్నికలపై అధికార టిఆర్ఎస్ అపరేషన్ మొదలుపెట్టింది. మున్సిపల్ ఎన్నికలలో దాదాపు 90 శాతానికి పైగా స్థానాలు గెలుచుకున్న టిఆర్ఎస్ .. గ్రేటర్ ఎన్నికల్లో మరో సారి అవే ఫలితాలను పునరావృతం చేసేందుకు సిద్ధమవుతోంది.

గ్రేటర్ పరిధిలో ఉన్న 150 వార్డులో 50 వార్డుల్లో ఎంఐఎం ప్రభావం చూపుతుంది. గత ఎన్నికల్లో దాదాపు 100  స్థానాలను టిఆర్ఎస్ గెలుచుకకుంది. ఈ విడత ఎన్నికల్లో కూడా వందకు పైగా స్థానాలను కైవసం చేసుకోవాలని గులాబీ పార్టీ చూస్తోంది.

Also Read:తెలంగాణలో మారుతున్న సీన్: టీఆర్‌ఎస్‌తో ఢీ అంటున్న బీజేపీ, కాంగ్రెస్ మాత్రం ఇలా..

రాబోయే ఎన్నికలకు సంబంధించి గ్రేటర్ మంత్రులు ఇప్పటి నుంచే క్షేత్ర స్థాయి పర్యటనలు మొదలు పెట్టారు. అటు అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు సర్కారు పావులు కదుపుతోంది.

దీనిలో భాగంగా నగరంలోని ప్రధాన కూడళ్లను సుందరంగా ముస్తాబు చేస్తోంది. గ్రేటర్ పరిధిలో అప్పుడే వెలుగులు కనిపిస్తున్నాయి. బస్తీ దవాఖానాలు భారీగా పెంచాలని సర్కార్ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 100 బస్తీ హాస్పిటల్స్ ఉండగా... మరో 250 కొత్తగా మొదలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. 

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేసి లబ్ది దారులకు అందించేందుకు నేతలు కసరత్తు చేస్తున్నారు. దాదాపు లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారు . ఇందుకు సంబంధించి నగర శివార్లలోని కొల్లూరులో ఒకేచోట పెద్ద ఎత్తున మొదలు పెట్టిన నిర్మాణాలు తుది దశకు చేరుకుంటున్నాయి.

Also Read:గులాబీ నేతలకు పదవుల పండగే: సీనియర్లకు తొలి ప్రాధాన్యత

రాబోయే రోజుల్లో గ్రేటర్ పరిధిలో రోడ్ల మరమ్మత్తులు, డ్రైనేజీ సమస్యలు, మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే అప్రమత్తంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది గులాబీ దళం.