Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో మారుతున్న సీన్: టీఆర్‌ఎస్‌తో ఢీ అంటున్న బీజేపీ, కాంగ్రెస్ మాత్రం ఇలా..

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రేక్షక పాత్రకు పరిమితం అవుతోంది. 

Bjp plans to get Congress position in Telangana politics
Author
Hyderabad, First Published Feb 19, 2020, 6:10 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రేక్షక పాత్ర వహిస్తున్నట్లు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా టిఆర్ఎస్, బిజెపి పార్టీల నేతలు  విమర్శలు చేసుకుంటూ పొలిటికల్ గా వేడి పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం రాష్ట్ర రాజకీయాలు పట్టనట్లు వ్యవవహరిస్తోందన్న చర్చ రాజకీయాల్లో మొదలైంది.

 సిఏఏ,రిజర్వేషన్లకు అనుకూలంగా పార్టీ నేతలు ఇటీవల వ్యాఖ్యలు చేస్తున్నా రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు , రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఏమాత్రం పెద్దగా స్పందించడంనలేదన్న వాదన మొదలైంది.

ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలలో ఆ పార్టీకి వచ్చిన ఫలితాలు... పార్టీ నేతలను నైరాశ్యం లోకి నెట్టాయన్న వాదన కూడా ఉంది. పట్టణ ప్రాంత ఓటర్లలో  పట్టుందని నిరూపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసినా  ఆశించిన ఫలితాలు రాలేదు. కొన్ని మునిసిపాలిటీలలో కాంగ్రెస్, బిజెపిలు కలిసి  అధికారాన్ని దక్కించుకున్నాయి.

 ఇటీవల జరిగిన సహకార ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పెద్దగా ఫలితాలు సాధించలేక పోయింది. ఈ ఎన్నికల్లో కూడా అధికార పార్టీ అభ్యర్థులు దాదాపు 90 శాతానికి పైగా స్థానాలు సాధించి రైతుల్లో కూడా తమకు పట్టు ఉందని నిరూపించుకొంది.

 ప్రతిపక్ష పార్టీ హోదా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో కూడా డీలా పడింది అన్న ప్రచారం మొదలైంది. ఆ పార్టీకి ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేలు,ముగ్గురు ఎంపీల ఎవరి దారి వారిదే అన్న చందంగా వ్యవహరిస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి.

కాంగ్రెస్ నేతల్లో ఉన్న అనైక్యత నేతల మధ్య సమన్వయ లోపం తదితర అంశాలను బిజెపి తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని ఆక్రమించుకోవాలని బీజేపీ పావులు కదుపుతోంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే అధికార పార్టీ పై బీజేపీ నేతలు మండి పడుతున్నారు. రాష్ట్ర నేతల నుంచి జాతీయ స్థాయి నేతలు కూడా టి ఆర్ ఎస్ వైఖరిని  తప్పుబడుతున్నారు.

సి ఏ ఏ లాంటి అంశాలతో కేంద్రం తో తాడో పేడో తేల్చుకుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేయడంతో బీజేపీ, టిఆర్ ఎస్ ల మధ్య పోరు మరింత ముదిరింది.దీంతో బీజేపీ నేతలు టీఆర్ఎస్ పై మరింత దూకుడు పెంచారు. 

బిజెపి జాతీయ నేతలు రాష్ట్రంలో గతంలో పర్యటించి పలు పథకాల పై తమ అభిప్రాయాలను స్పష్టం చేసెవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు బిజెపి నేతలు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ  విమర్శలు చేస్తున్నారు.

రాష్ట్రంలో టిఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని ప్రకటనలు చేస్తున్నారు. బిజెపి నేతల తీరు  చూస్తుంటే దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగానే అధికార పార్టీపై విమర్శల దాడి పెంచుతున్నారన్న చర్చ జరుగుతోంది  టిఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు బిజెపి ఎమ్ఐఎమ్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై కమల నాథులు మండిపడుతున్నారు

Follow Us:
Download App:
  • android
  • ios