టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు, ఆ పార్టీ సీనియర్ నేత సుదర్శన్ రావు మరణించారు. బుధవారం ఉదయం ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. కొన్ని రోజుల క్రితం సుదర్శన్ కరోనా బారినపడ్డారు. గచ్చి బౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే  ఆయన గుండెపోటుతో కన్నుమూశారు.  సుదర్శన్ రావు మృతితో టీఆర్ఎస్ పార్టీలో విషాద ఛయాలు అలుముకున్నాయి.

కాగా.. సుదర్శన్ మృతి పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదర్శన్ రావు కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఉద్యమం తొలినాళ్లలో అద్భుతంగా పనిచేసిన  నాయకుడు అంటూ సీఎం కేసీఆర్ కొనియాడారు. చిన్న వయసులో చనిపోవడంద దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. సుదర్శన్ రావు మృతి పట్ల ఇతర టీఆర్ఎస్ నాయకులు సంతాపం  ప్రకటించారు.