trs dharna...రైతు తిరగబడితే ఎడ్లబండి కింద మీ పార్టీ నలిగిపోతుంది: బీజేపీకి కేటీఆర్ వార్నింగ్


వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరిని తెలపాలని కోరుతూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా  ధర్నాలు నిర్వహించారు. సిరిసిల్లలో నిర్వహించిన ధర్నాలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

TRS holds protest:KTR Serious Comments  On  Bjp in Rajanna Siricilla

సిరిసిల్ల: రైతు తిరగబడితే ఎడ్లబండి కింద మీ పార్టీ నలిగిపోతోందని బీజేపీ నేతలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ఇవాళ మీ పార్టీ నేతలు రైతులను కార్ల కింద తొక్కిస్తుండొచ్చు... కానీ రైతు తిరగబడితే మాత్రం మీ పార్టీ నలిగిపోతోందన్నారు.రైతుల సంక్షేమం కోసం ఏ ప్రభుత్వం చేపట్టని పథకాలు, కార్యక్రమాలను తీసుకొన్న చరిత్ర కేసీఆర్‌దేనని వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరిని చెప్పాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శుక్రవారం నాడు ఆందోళనలు నిర్వహించింది. ఈ ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన ధర్నాలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.ఈ ఏడేళ్లలో ఎప్పుడైనా కరువు కాటకాలున్నాయా కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయన్నారు. రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్ధం చేసుకోవాలన్నారు.రైతుకు పెద్దపీట వేసిన చరిత్ర కేసీఆర్‌దేనని ఆయన చెప్పారు. గతంలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు  క్యూ లైన్లు కట్టేవారని ఇవాళ ఆ పరిస్థితి ఉందా అని ktrs ప్రశ్నించారు.

also read:TRS Dharna: ఢిల్లీ పెద్దల్లారా... అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా..: మంత్రి హరీష్ ఆగ్రహం

Congress ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజుల్లో కనీసం ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వలేదన్నారు. ఆ ఆరు గంటల విద్యుత్ కూడా మూడు దఫాలు ఇచ్చేవారని కేటీఆర్ గుర్తు చేశారు.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని  ఆయన చెప్పారు. గత ప్రభుత్వాలు అవలంభించిన Farmer వ్యతిరేక విధానాలకు తిలోదకాలను ఇచ్చామన్నారు. రైతులకు తమ ప్రభుత్వం పెద్దపీట వేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.రైతు పెట్టుబడి కోసం రైతుబంధు పథకం ఇచ్చిన ఏకైక నాయకుడు సీఎం Kcr అని ఆయన చెప్పారు.దురదృష్టవశాత్తు రైతు చనిపోతే రైతు భీమాతో ఆ కుటుంబాన్ని ఆదుకొంటున్నామన్నారు.  ఎర్రటి ఎండల్లో కూడా మానేరు మత్తడి  దూకుతుందని ఎవరైనా కలగన్నారా అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో మాదిరిగా తెలంగాణ పల్లెల్లో కూడా నీరు, పంటలు పచ్చగా ఉండడానికి కేసీఆర్ కారణం కాదా అని కేటీఆర్ అడిగారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు తగ్గాయన్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కూడా గ్రామాలకు వెళ్లి వ్యవసాయం చేస్తున్నారని మంత్రి గుర్తు చేశారు. 3కోట్ల టన్నుల వరి ధాన్యం తెలంగాణ రైతులు పండిస్తున్నారని మంత్రి తెలిపారు. గట్టిగా అనుకొంటే వ్యవసాయాన్ని ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకుపోవచ్చో దేశానికి చేసి చూపింది టీఆర్ఎస్ సర్కార్ అని మంత్రి కేటీఆర్ చెప్పారు.  దేశాన్ని నడుపుతున్న బీజేపీ నేతలకు రైతులపై ప్రేమ లేదన్నారు.ఈ కారణంగానే రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు సహకరించడం లేదన్నారు.వరి పండించడంలో పంజాబ్ రాష్ట్రాన్ని తెలంగాణ దాటిందన్నారు. దేశానికి పట్టెడన్నం పెట్టే స్థాయికి తెలంగాణ చేరుకొందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios