Asianet News TeluguAsianet News Telugu

TRS Dharna: ఢిల్లీ పెద్దల్లారా... అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా..: మంత్రి హరీష్ ఆగ్రహం

తెలంగాణ రైతుల పక్షాన కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా టీఆర్ఎస్ పార్టీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు దిగింది. ఈ క్రమంలోనే సిద్దిపేటలో జరిగిన ధర్నాలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు కేంద్రంపై విరుచుకుపడ్డారు.

TRS Dharna at Sidddipet... minister harish rao  sensational comments on  union government
Author
Siddipet, First Published Nov 12, 2021, 12:39 PM IST

సిద్దిపేట: తెలంగాణ రైతులు పండించే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఇవాళ(శుక్రవారం) రాష్టవ్యాప్త ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. పంజాబ్ రైతుల నుండి మొత్తం ధాన్యాన్ని ఎలాగయితే కేంద్రం కొనుగోలు చేస్తుందో తెలంగాణ రైతుల నుండి కూడా అలాగే కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం కోరుతోంది. కేంద్రం తెలంగాణ రైతులపై వివక్ష ప్రదర్శిస్తోందని టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. 

ఈ క్రమంలో siddipet నియోజకవర్గ కేంద్రంలో రైతుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ధర్నాలో మంత్రి హరిష్ రావు పాల్గొన్నారు. ఈ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు రైతులు భారీ సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డ్స్ ప్రదర్శినతో పాటు నినాదాలతో ధర్నా ప్రాంగణం హోరెత్తింది.  

వీడియో

ఈ సందర్భంగా minister harish rao మాట్లాడుతూ... తెలంగాణ కు ఒక న్యాయం ... పంజాబ్ కు ఒక న్యాయమా...? అంటూ కేంద్రాన్ని నిలదీసారు. తెలంగాణ భారతదేశంలో భాగం కాదా...? అని ప్రశ్నించారు. తెలంగాణ రైతులు పండించిన వరి ధ్యాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొనదని అడిగారు. తెలంగాణ రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే FCI ద్వారా కొనుగోలు చేయాలని హరీష్ డిమాండ్ చేసారు. 

read more  TRS Dharna:బిజెపి సర్కార్ తో ఇక యుద్దమే... రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ ధర్నాలు (వీడియో)

''Bjp అంటేనే భారతీయ ఝూటా పార్టీ. ఢిల్లీ పెద్దల్లారా... అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా! వరి ధాన్యం కొనకుండా వంచిస్తారా..? పైకి దేశ భక్తి ప్రదర్శిస్తూ లోపల కార్పోరేట్ భక్తి కలిగివుంటారా. బిజెపి నేతల్లారా... ఇదేనా మీ ద్వంద్వ నీతి. రైతులను వంచించడమే దేశ భక్తా... సిగ్గు..సిగ్గు!! వెంటనే రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలి'' అన్నారు.

''telangana farmers పై కేంద్రంలోని Bjp ప్రభుత్వానికి ఇంత కక్ష ఎందుకు...? తెలంగాణ రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొంటుందో, కొనదో స్పష్టం చేయాలి.  రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత, విధి. కాబట్టి తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలి'' అని కోరారు. 

''కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను కూడా వెంటనే రద్దు చేయాలి. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయమంటే రైతులపైకి కార్లు ఎక్కించి చంపుతారా... ఇదెక్కడి న్యాయం'' అంటూ హరీష్ మండిపడ్డారు. 

read more  ఆ బియ్యం కొనకుంటే మీ ఇళ్లముందే ధర్నా..: బిజెపి నాయకులకు మంత్రి గంగుల వార్నింగ్ (వీడియో)

''రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాడుదాం. పంజాబ్ రైతుల వద్ద వరి ధాన్యం కొంటూ తెలంగాణ రైతుల వద్ద ధాన్యం ఎందుకు కొనరు? కేంద్ర ప్రభుత్వమా ఇదెక్కడి న్యాయం..? కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ నీతికి వ్యతిరేకంగా పోరాడుదాం. కేంద్ర ప్రభుత్వామా కళ్ళు తెరువు... తెలంగాణ రైతుల వరి ధాన్యం కొను'' అని కోరారు.

''తెలంగాణ రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలి.రాష్ట్ర bjp నేతలకు తెలంగాణ రైతులపై ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి వరి ధాన్యాన్ని కొనిపించాలి'' అని హరీష్ అన్నారు.

''తెలంగాణ రైతులను దగా చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పై పోరాడుదాం. తెలంగాణ రైతుల ఐక్యత వర్ధిల్లాలి. పోరాడుదాం..కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదాం... !! పోరాడుదాం.. !! కార్పోరేట్లకు కొమ్ముకాస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాడుదాం...పోరాడుదాం... రైతులను వంచిస్తున్న రాష్ట్ర బిజేపీ నాయకుల వైఖరిని ఎండగడదాం..!! తెలంగాణ రైతులను రక్షించుకుందాం..!!'' అంటూ మంత్రి హరీష్ తో పాటు ధర్నాలో పాల్గొన్నవారు నినదించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios