Asianet News TeluguAsianet News Telugu

గజం స్థలం..కేవలం రూ.100కే.. ప్రభుత్వం ఆఫర్

భూముల కేటాయింపుపై విధాన నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో విధివిధానాలను రూపొందిస్తున్న ప్రభుత్వం.. అది పూర్తవగానే లేఖలు రాయనుంది.

trs govt bumper offer to political parties..
Author
Hyderabad, First Published Aug 10, 2018, 10:52 AM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. బంపర్ ఆఫర్ ప్రకటించింది. గజం స్థలం కేవలం రూ.100కే అందించనుంది. సంతోషంతో ఎగిరి గంతేయాలనిపిస్తోందా..? కాస్త ఆగండి. ఎందుకంటే ఈ ఆఫర్ సామాన్య ప్రజల కోసం కాదు.. రాజకీయ పార్టీ నేతలకు మాత్రమే. ఇంతకీ మ్యాటరేంటంటే..

రాష్ట్రంలో గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలకు జిల్లా, రాష్ట్ర కేంద్రాల్లో భూములు కేటాయించడానికి వీలుగా విధానాన్ని సిద్ధం చేస్తోంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాజకీయ పార్టీల కార్యాలయాలకు భూముల కేటాయింపుపై విధాన నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో విధివిధానాలను రూపొందిస్తున్న ప్రభుత్వం.. అది పూర్తవగానే లేఖలు రాయనుంది.
 
టీఆర్‌ఎస్‌ కార్యాలయాల కోసం ఇప్పటికే 28 చోట్ల ఎకరానికి మించకుండా భూములు ఇవ్వడానికి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కేవలం టీఆర్‌ఎస్‌ కార్యాలయాలకే భూములిస్తే అపవాదులు వస్తాయని గుర్తించిన ప్రభుత్వం.. ఇతర పార్టీలకూ ఇవ్వడానికి వీలుగా నూతన విధానాన్ని రూపొందిస్తోంది. ఇప్పటిదాకా పార్టీ కార్యాలయాలకు ట్రస్టుల పేరుతోనే భూములు కేటాయించగా.. ఇకపై పార్టీలకే భూములు ఇవ్వనున్నారు. ఏపీలో కూడా ఇటీవలే రాజకీయ పార్టీలకు చట్టసభల్లో బలం ఆధారంగా భూములను లీజుకు ఇవ్వడానికి పాలసీ తెచ్చారు. అలా కాకుండా నామమాత్రపు విలువతో పార్టీలకు భూములివ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే పార్టీలకు లేఖలు రాయనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios