ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇచ్చారు.
న్యూఢిల్లీ: Telangana పై రాజ్యసభలో ప్రధాని Narendra Modi చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీలు గురువారం నాడు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. తెలంగాణను అవమానించారని ఆ నోటీసులో TRS ఎంపీలు పేర్కొన్నారు. Rajyasabha సెక్రటరీ జనరల్ కు టీఆర్ఎస్ ఎంపీలు నోటీసులు అందించారు.తలుపులు మూసి తెలంగాణ బిల్లు పాస్ చేశారని మాట్లాడడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని టీఆర్ఎస్ ఎంపీలు చెబుతున్నారు.

Parliament లో పాస్ అయిన బిల్లును అవహేళ చేయడం సరికాదని టీఆర్ఎస్ ఎంపీలు కోరుతున్నారు. రాజ్యసభలో తెలంగాణపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు సభా హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని టీఆర్ఎస్ ఎంపీలు అభిప్రాయపడుతున్నారు.ప్రధానిపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చిన విషయాన్ని టీఆర్ఎస్ ఎంపీ కె. కేశవరావు ఇవాళ రాజ్యసభలో ప్రస్తావించారు. ప్రివిలేజ్ మోషన్ నోటీస్ ను రాజ్యసభ ఛైర్మెన్ పరిశీలన కోసం పంపామని రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ చెప్పారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 8వతేదీన రాజ్యసభలో ప్రసంగించారు. ఇందులో భాగంగానే Andhra pradesh రాష్ట్ర విభజనపై కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. రాష్ట్ర విభజన సరిగా చేసి ఉంటే ఇలాంటి సమస్యలు వచ్చి ఉండేవి కావన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని ఆయన చురకలంటించారు. రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకం కాదని Prime Minister మోడీ స్పష్టం చేశారు. విభజన జరిగిన తీరును మాత్రం ఆయన తప్పుబట్టారు. ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందన్నారు. కేంద్రంలో అధికారంలోకి రావడానికి అవకాశం ఇచ్చిన ఏపీకి అన్యాయం చేశారని మోడీ గుర్తు చేశారు. హడావుడిగా రాష్ట్ర విభజన చేశారని మోడీ మండిపడ్డారు.
Vajpayee ప్రధానిగా ఉన్న సమయంలో ఏర్పాటు చేసిన రాష్ట్రాల గురించి ఆయన గుర్తు చేశారు. ఆనాటి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకొన్న కారణంగానే ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి సమస్యలు రాలేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొన్న హడావుడి నిర్ణయాలతో ఇబ్బందులు వచ్చాయన్నారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన సమయంలో చోటు చేసుకొన్న పరిణామాలను ఆయన గుర్తు చేశారు. విభజన వ్యవహరం ఎలా జరిగిందనేది కీలకమన్నారు. Parliament లో మైకులు కట్ చేసి తలుపులు మూసి బిల్లు పాస్ చేశారని ప్రధాని మోడీ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇలా చేస్తారా అని మోడీ ప్రశ్నించారు. మీ అహంకారంతో తెలుగు రాష్ట్రాలకు నష్టం జరిగిందన్నారు గతంలో తాము ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పాటు చేసిన మమయంలో శాంతియుత వాతావరణం ఉన్న విషయాన్ని మోడీ గుర్తు చేసుకొన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఈ తరహ చర్యలు తీసుకోలేదన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్, కాంగ్రెస్ తీవ్రంగా మండిపడుతుంది. మోడీ వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం నాడు రాష్ట్రంలో టీఆర్ఎస్ నిరసనలను దిగింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా మోడీ దిష్టిబొమ్మలను దగ్దం చేశారు.తెలంగాణపై మోడీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని క్షమాపణలు చెప్పాలని టీఆర్ఎస్ డిమాండ్ చేసింది.అయితే మోడీ వ్యాఖ్యలను బీజేపీ నేతలు సమర్ధిస్తున్నారు. కాంగ్రెస్ ను మోడీ విమర్శిస్తే టీఆర్ఎస్ ఎందుకు భుజాలు తడుముకొంటుందో అర్ధం కావడం లేదన్నారు. విబజన జరిగిన తీరును మోడీ ప్రశ్నించారని కాషాయ పార్టీ నేతలు చెబుతున్నారు.
