టీఆర్‌ఎస్ ప్లీనరీలో కాసుల గలగల : 20 కోట్లకు పైమాటే

TRS gets Rs 20 crores party funds with no time
Highlights

కాసుల కమామిషూ ఏందంటే ?

టిఆర్ఎస్ పార్టీ ఖజానా నిండిపోయింది. ఒక్క దెబ్బతో గల్లపెట్టె నిండింది. ప్లీనరీలో పార్టీ నేతలు ఇచ్చిన విరాళాలు ఎంతో తెలుసా? 20 కోట్లకు పైమాటే. పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలు ముఖ్య నేతలంతా విరాళాలు చదివించారు. సిఎం కేసిఆర్ ఎవరు ఎంత విరాళం ఇచ్చారో వారి పేరు సభలో అనౌన్స్ చేశారు.

17 ఏళ్ల గులాబీ పండుగ కొంపల్లిలోని బీబీఆర్ గార్డెన్స్ వేదికగా అట్టహాసంగా కొనసాగుతోంది. టీఆర్‌ఎస్ ప్లీనరీ సందర్భంగా పార్టీ నేతలు తమకు తోచినంతా విరాళాలు ప్రకటించారు. పలువురు నాయకులు ఇవాళ టీఆర్‌ఎస్ పార్టీకి రూ. 21 కోట్ల 41 లక్షల విరాళాలు ఇచ్చారు.

పార్టీ నిధి విషయమై కేసిఆర్ మాట్లాడుతూ.. ఇంతకుముందు పార్టీ ఫండ్ రూ. 21 కోట్ల 67 లక్షలు ఉందన్నారు. తాజా విరాళాలతో కలిపి మొత్తం రూ. 42 కోట్ల 8 లక్షల రూపాయాలు అయిందని కేసీఆర్ ప్రకటించారు. ఈ వివరాలన్నింటినీ త్వరలోనే.. ఇన్‌కమ్ ట్యాక్స్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సమర్పిస్తామని సీఎం స్పష్టం చేశారు.

గతంలో ప్లీనరీ వచ్చిందంటే చాలు టిఆర్ఎస్ నేతలు కూలిపనికి దిగేవారు. పార్టీ అధినేత నుంచి మొదలుకొని సామాన్య కార్యకర్త వరకు కూలి పనిచేసి నిధి సేకరించేవారు. టిఆర్ఎస్ ఏర్పాటైన నాటినుంచి అనేక సందర్భాల్లో పార్టీ నిధులను అలా సేకరించారు. తుదకు సర్కారు ఏర్పాటైన తర్వాత కూడా గులాబీకూలీ పని చేశారు. అయితే గులాబీ కూలిపై రేవంత్ రెడ్డి కోర్టులో కేసు వేశారు. దీంతో ఈసారి ప్లీనరీలో గులాబీ కూలీల హడావిడి మాయమైంది. పార్టీ నేతల విరాళాల రూపంలో నిధుల సేకరణ చేపట్టింది టిఆర్ఎస్.

విరాళాలు ఇచ్చిన వారి వివరాలు కింద ఉన్నాయి.

ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రూ. 2 కోట్లు.

మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి రూ. కోటి

టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ సలీం రూ. కోటి.

మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి, తనయుడు రవీందర్‌రెడ్డి రూ. 2 కోట్లు.

టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ రూ. కోటి.

టీఆర్‌ఎస్ ఎంపీ విశేశ్వర్‌రెడ్డి రూ. కోటి.

నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి రూ. కోటి.

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రూ. 75 లక్షలు.

ఎంపీ బీబీ పాటిల్ రూ. 51 లక్షలు.

దండె విఠల్ రూ. 50 లక్షలు.

ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి రూ. 50 లక్షలు.

ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి రూ. 50 లక్షలు.

కొత్త మహేందర్‌రెడ్డి రూ. 50 లక్షలు.

ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి రూ. 40 లక్షలు.

ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రూ. 25 లక్షలు.

రామ్మోహన్‌రావు రూ. 25 లక్షలు.

పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి రూ. 25 లక్షలు.

గుండు సుధారాణి రూ. 25 లక్షలు.

మహేశ్ బిగాల రూ. 25 లక్షలు.

ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి రూ. 25 లక్షలు.

ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి రూ. 25 లక్షలు.

ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ రూ. 25 లక్షలు.

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి రూ. 25 లక్షలు.

ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి 25 లక్షలు.

ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి రూ. 25 లక్షలు..

ఇంకొంతమంది నేతలు కూడా తమకు తోచిన రీతిలో విరాళాలు అందజేశారు.

loader