Asianet News TeluguAsianet News Telugu

సంతోష్ వల్లే టికెట్ రాలేదు...బిజెపిలో చేరిన బోడిగే శోభ

టీఆర్ఎస్ పార్టీలో టికెట్ల లొల్లి కొనసాగుతోంది. ఇటీవల టీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన రెండో జాబితాలో చొప్పదండి సీటు ఆశించి భంగపడ్డ  తాజామాజీ ఎమ్మెల్యే బోడిగె శోభ పార్టీని వీడారు. తెలంగాణ బిజెపి అధ్యక్షులు లక్ష్మణ్ సమక్షంలో ఆమె ఇవాళ బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.  

trs ex mla bodige shobha joined bjp
Author
Choppadandi, First Published Nov 15, 2018, 3:49 PM IST

టీఆర్ఎస్ పార్టీలో టికెట్ల లొల్లి కొనసాగుతోంది. ఇటీవల టీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన రెండో జాబితాలో చొప్పదండి సీటు ఆశించి భంగపడ్డ  తాజామాజీ ఎమ్మెల్యే బోడిగె శోభ పార్టీని వీడారు. తెలంగాణ బిజెపి అధ్యక్షులు లక్ష్మణ్ సమక్షంలో ఆమె ఇవాళ బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.  

ఈ సందర్భంగా శోభ మాట్లాడుతూ... తనకు టీఆర్ఎస్ తరపున చొప్పదండి టికెట్ రాకపోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ బందువులే కారణమని ఆరోపిచారు. ముఖ్యంగా రవీందర్ రావ్, సంతోష్ లు తనకు వ్యతిరేకంగా తెరవెనుక రాజకీయాలు నడిపారని మండిపడ్డారు. తన పనితీరు ఎంతో బాగుందని కేసీఆరే స్వయంగా చెప్పారని...అలాంటిది తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దళితురాలిని కావడం కూడా తనకు టికెట్ రాకపోవడాని మరో కారణమని శోభ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా బిజెపి అధ్యక్షులు లక్ష్మణ్ కూడా టీఆర్ఎస్, మహా కూటమిలపై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ బోడిగే శోభకు మోసం చేసిందన్నారు. ఇక మహా కూటమి నుండి ఎవరు గెలిచినా వారు చివరకు టీఆర్ఎస్ గూటికే చేరతారని అన్నారు. కాబట్టి బిజెపి అభ్యర్థులను గెలిపించాలని తెలంగాణ ప్రజల్ని లక్ష్మణ్ కోరారు.  

మరిన్ని వార్తలు

కేసీఆర్ నన్ను మెడపట్టి గెంటేశారు.. బొడిగె శోభ

వదిలిపెట్టను: కేసీఆర్ పై బొడిగె శోభ తిరుగుబాటు

పార్టీ మార్పుపై తేల్చేసిన బొడిగె శోభ

Follow Us:
Download App:
  • android
  • ios