హైదరాబాద్: కారు పార్కింగ్ విషయంలో యువతిపై దాడికి పాల్పడిన కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ను సోమవారం నాడు సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ నెల 19వ తేదీన నాగేందర్ యాదవ్ ఓ యువతిపై దాడికి దిగాడు.  ఈ దాడిపై  కార్పోరేటర్ పై యువతి ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదుపై  పోలీసులు విచారణ చేసి ఇవాళ నాగేందర్ ను అరెస్ట్ చేశారు.

శేరిలింగంపల్లిలోని లక్ష్మీవిహార్ ఫేజ్ 2 లో కార్పోరేటర్ నాగేందర్ యాదవ్ నివాసం ఉంటున్నాడు. అదే కాలనీలో వేణుగోపాల్ అనే వ్యక్తి కుటుంబం కూడ నివాసం ఉంటుంది.వేణుగోపాల్ కూతురికి, కార్పోరేటర్ కి మధ్య కారు పార్కింగ్ విషయంలో  గొడవ జరిగింది.ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి యువతిపై నాగేందర్ యాదవ్ దాడి చేశాడు.

ఈ దాడిపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఈ ఫిర్యాదుపై నాగేందర్ యాదవ్ పై 448, 504 సెక్షన్ల కింద కేసు పెట్టారు.ఈ కేసులో ఇవాళ పోలీసులు నాగేందర్ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు