ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్,టీఆర్ఎస్ కార్యకర్తల ఘర్షణ

trs,congress supporters fight at kamareddy district
Highlights

 ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి స్వగ్రామంలో ఘటన 

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీఆర్ఎస్ వర్గాల మద్య ఘర్షణ వాతావరణం నెలకొంది. స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి స్వగ్రామం లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో నియోజకవర్గ పరిధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ నల్లమడుగు సురేందర్ చేపట్టిన రాజీవ్ సందేశ్ యాత్ర సందర్భంగా ఈ ఘర్షణ చోటుచేసుకుంది. ఈ రాజీవ్ సందేశ్ యాత్రలో భాగంగా సురేందర్ కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి లింగంపేట్ మండలం నుండి పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్ర నిన్న రాత్రి తాడ్వాయి మండలంలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యే  ఏనుగు రవీందర్ రెడ్డి స్వగ్రామమైన ఎర్రా పహడ్ కు చేరుకుంది. ఇక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ యాత్రకు అడ్డు తగలడంతో ఇరు వర్గాల మద్య తోపులాట మొదలై ఘర్షనకు దారి తీసింది.

 టీఆర్ఎస్,కాంగ్రెస్‌ నాయకుల మద్య వాగ్వివాదం జరిగి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.కాంగ్రెస్ గో బ్యాక్ అంటూ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది.  ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.  


 

loader