ఎర్రబెల్లి దయన్న బాబ్లీ టైగర్ అట

trs cadre says errabelli was babli tiger
Highlights

  • పోచంపాడు సభ ఏర్పాట్లలో కొత్త తరహా ప్రచారం
  • ఎర్రబెల్లి దయన్న బాబ్లీ టైగర్ అంటూ కార్యకర్తల పోస్టర్లు
  • సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్

టిడిపి మాజీ నేత, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు అభిమానుల ప్రచారం సరికొత్త పంథాలో సాగుతున్నది. ఆయనను ఉద్దేశించి ఒక పోస్టు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది. బాబ్లీ టైగర్ దయన్న నాయకత్వం వర్ధిల్లాలి అని ఆ పోస్టర్ రాశారు. చలో పోచంపాడు అని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రైతు పునరుజ్జీవ మహాసభ పేరుతో పోస్టర్లు పంపిణీ చేశారు.

ఎర్రబెల్లి దయాకర్ రావు టిడిపిలో ఉన్న సమయంలో చలో బాబ్లీ ప్రాజెక్టుకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.  ఆ సందర్భంగా ఎర్రబెల్లి తోపాటు చాలా మంది టిడిపి నేతలు అక్కడ వీరోచితంగా పోరాటం చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు కూడా అక్కడ మకాం వేశాడు. అయితే ధర్నా చేస్తున్న టిడిపి నేతలను మహారాష్ట్ర పోలీసులు చితకబాదారు. అందులో ఎర్రబెల్లి దయాకర్ రావును అక్కడి పోలీసులు టార్గెట్ చేసి దాడిచేసి కొట్టారు.

ఇదంతా గతం. దయాకర్ రావు ప్రస్తుతం టిఆర్ఎస్ లో చేరారు. టిడిపిలో ఉండి చేసిన బాబ్లీ పోరాటాన్ని గుర్తు చేస్తూ ఎర్రబెల్లి అభిమానులు దయన్న బాబ్లీ టైగర్ అంటూ పోస్టర్లు పంపిణీ చేయడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఎర్రబెల్లి బాబ్లీ టైగర్ అని ఎందుకుంటున్నారు? తెలంగాణ టైగర్ అనొచ్చు కదా అని సోషల్ మీడియాలో కౌంటర్లు కూడా షురూ అయినాయి.

loader