తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేములలో బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు యత్నించాయి.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేములలో బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు యత్నించాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టాయి.టీఆర్‌ఎస్ శ్రేణులను వేరే ప్రాంతానికి తరలించారు. సంజయ్ పాదయాత్రను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు యత్నించడంతో.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.
ఇక, బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ పాదయాత్రను గురువారం అలంపూర్లో ప్రారంభించారు. ప్రజాస్వామ్య తెలంగాణ సాధించేందుకే బీజేపీ పాదయాత్రను చేపట్టినట్టుగా సంజయ్ చెప్పారు. ఇక, నేడు బండి సంజయ్ పాదయాత్ర ఐదో రోజుకు చేరింది. నేడు జోగులాంబ గద్వాల జిల్లాలోని.. వేముల, బట్లదిన్నె, షాబాద్ మీదుగా ఉదండపూర్ వరకు సంజయ్ పాదయాత్ర కొనసాగుంది. ప్రజాసంగ్రామ పాదయాత్రలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు.
