Asianet News TeluguAsianet News Telugu

ఆదిలాబాద్: పులి చర్మం తరలింపు.. నిందితుల అరెస్ట్, వాళ్లు అమాయకులంటూ గిరిజనుల ఆందోళన

ఆదిలాబాద్ జిల్లాలో (adilabad district) ఆదివాసీలు (tribals protest) ఆందోళనకు దిగారు. అమాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇంద్రవెల్లి (indravelli) అటవీశాఖ కార్యాలయం (forest department office) ముందు రోడ్డుపై తమ నిరసన తెలిపారు

tribals protest in indravelli forest department office
Author
Indervelly, First Published Oct 31, 2021, 4:43 PM IST

ఆదిలాబాద్ జిల్లాలో (adilabad district) ఆదివాసీలు (tribals protest) ఆందోళనకు దిగారు. అమాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇంద్రవెల్లి (indravelli) అటవీశాఖ కార్యాలయం (forest department office) ముందు రోడ్డుపై తమ నిరసన తెలిపారు. ఇవాళ మహారాష్ట్రకు (maharashtra) పది మంది పులిచర్మాన్ని (tiger skin) తరలిస్తుండగా కాగజ్ నగర్ దగ్గర అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా పులి చర్మాన్ని తరలిస్తున్న అందరినీ అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులు కాగజ్ నగర్ (kagaznagar) ఫారెస్ట్ నుంచి పులి చర్మాన్ని సేకరించినట్లు అధికారులు భావిస్తున్నారు. 

ALso Read:పులిచర్మం అక్రమ తరలింపు.. ఇద్దరు అరెస్ట్..

కాగా.. ఈ ఏడాది జూలై 30న కూడా ఏటూరునాగారం (eturnagaram) మండలం ముల్లకట్ట గోదావరి వంతెన వద్ద పులి చర్మం తరలిస్తున్న ఇరువురిని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్దనుంచి పులి చర్మంతో పాటు ద్విచక్రవాహనం, మొబైల్ ను స్వాధీనం చేసుకున్నారు. చత్తీస్‌గడ్‌కు చెందిన సాగర్ అనే వ్యక్తి ద్వారా పులి చర్మాన్ని సేకరించిన వాజేడుకు చెందిన తిరుమలేష్ ఛత్తీస్‌గడ్‌కు చెందిన సత్యం అనే వ్యక్తి సహాయంతో రూ.30 లక్షలకు విక్రయించేందుకు బేరం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో పులి చర్మాన్ని తరలిస్తుండగా ఏటూరునాగారం పోలీసులు పట్టుకున్నారు. వారిపై అటవీ సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. తాజాగా ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలో పులి చర్మం పట్టుబడటంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios