పులిచర్మం అక్రమ తరలింపు.. ఇద్దరు అరెస్ట్..

చత్తీస్ గడ్ కు చెందిన సాగర్ అనే వ్యక్తి ద్వారా పులి చర్మాన్ని సేకరించిన వాజేడుకు చెందిన తిరుమలేష్ చత్తీస్గడ్ కు చెందిన సత్యం అనే వ్యక్తి సహాయంతో రూ.30లక్షలకు విక్రయించేందుకు బేరం కుదుర్చుకున్నారు. 

Telangana : Eturnagaram police arrest 2 tiger skin smugglers - bsb

ములుగు జిల్లా : ఏటూరునాగారం మండలం ముల్లకట్ట గోదావరి వంతెన వద్ద పులి చర్మం తరలిస్తున్న ఇరువురిని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్దనుంచి పులి చర్మంతో పాటు ద్విచక్రవాహనం, మొబైల్ ను స్వాధీనం చేసుకున్నారు. 

చత్తీస్ గడ్ కు చెందిన సాగర్ అనే వ్యక్తి ద్వారా పులి చర్మాన్ని సేకరించిన వాజేడుకు చెందిన తిరుమలేష్ చత్తీస్గడ్ కు చెందిన సత్యం అనే వ్యక్తి సహాయంతో రూ.30లక్షలకు విక్రయించేందుకు బేరం కుదుర్చుకున్నారు. 

ఈక్రమంలో పులి చర్మాన్ని తరలిస్తుండగా ఏటూరునాగారం పోలీసులు పట్టుకున్నారు. వారిపై అటవీ సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘనతో సంబంధమున్న మిగతవారిని పట్టుకుంటామని ఎస్పీ సంగ్రాంసింగ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పీ శ్రీ  గౌష్ ఆలం ఐపీఎస్, శివ ఆశిష్ సింహం ఐఎఫ్ఎస్, స్పెషల్ ఆఫీసర్ ఏటూరునాగారం ప్రశాంత్ పాటిల్, సీఐ ఏటూరునాగారం కిరణ్ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, శ్యాం ప్రసాద్ సిబ్బంది అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
 
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios