హైదరాబాద్ బోరబండలో ఓ ట్రాన్స్‌జెండర్ కనిపించకుండా పోయింది. దీంతో అతడి సహచరుడు ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అతడు తమ వద్ద డబ్బు అప్పుగా తీసుకుని కనిపించకుండా పోయాడని మరికొందరు పోలీసులను ఆశ్రయించారు.
హైదరాబాద్ బోరబండలో ఓ ట్రాన్స్‌జెండర్ కనిపించకుండా పోయింది. దీంతో అతడి సహచరుడు ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అతడు తమ వద్ద డబ్బు అప్పుగా తీసుకుని కనిపించకుండా పోయాడని మరికొందరు పోలీసులను ఆశ్రయించారు. వివరాలు.. ఎస్సార్ నగర పోలీసు స్టేషన్ పరిధిలోని బోరబం సైట్-3 బాలాజీ ఎన్‌క్లేవ్‌లో ట్రాన్స్‌జెండర్ కల్యాణ్.. కొద్ది మంద్రి ఫ్రెండ్స్‌తో కలిసి రూమ్‌లో ఉంటున్నాడు. అయితే ఇటీవల కల్యాణ్.. అతడి సొంతూరైన గుంటూరు జిల్లా ఉప్పరపాలేనికి వెళ్తున్నట్టుగా చెప్పి వెళ్లిపోయాడు.
అయితే కల్యాణ్ ఫోన్ స్విచ్చాఫ్ రావడం.. అతడు ఉప్పరపాలేనికి వెళ్లలేదని తెలసుకున్న సహచరులు.. అతడి ఆచూకీ కోసం పలుచోట్ల గాలింపు చేపట్టారు. అయితే లాభం లేకపోవడంతో.. అతడి సహచరుడు వశీం మంగళవారం ఉదయం వారు ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఆ తర్వాత కల్యాణ్ తమ వద్ద అప్పుగా రూ. 30 లక్షల వరకు తీసుకుని పారిపోయవాడని మరికొందరు సహచరులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.
