హైదరాబాద్ : పాతబస్తీలో భారీ శబ్ధంతో పేలిన ట్రాన్స్‌ఫార్మర్.. పరుగులు తీసిన స్థానికులు
హైదరాబాద్ పాతబస్తీలోని మాదన్నపేటలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పేలింది. ఈ ఘటనలో రెండు ఇళ్లు, ఆటో పూర్తిగా దగ్ధమయ్యాయి. భారీ శబ్ధం రావడంతో ప్రజలు పరుగులు తీశారు.
హైదరాబాద్ (hyderabad) పాతబస్తీలో (old city) పేలుడు (blast) సంభవించింది. మాదన్నపేటలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పేలింది. (transformer blast) దీంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెండు ఇళ్లు, ఆటో పూర్తిగా దగ్థమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఒక్కసారిగా భారీ శబ్ధం రావడంతో స్థానికులు భయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు.